Wednesday, May 15, 2024
- Advertisement -

ఆసీస్‌తో ఫైనల్‌..టీమిండియాకు కష్టమేనా?

- Advertisement -

గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో భారత్‌తో తలపడనుంది ఆస్ట్రేలియా. 20 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడనుండగా ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. రల్డ్ కప్ లీగ్ దశలో ఆస్ట్రేలియాపై విజయం సాధించినప్పటికీ.. ఫైనల్ లో ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేస్తే టీమిండియా భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదని క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే 20 ఏళ్ల కిందటి భారత జట్టుకు ప్రస్తుత టీమిండియాకు చాలా తేడా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ ,ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో పటిష్టంగా ఉంది రోహిత్ సేన. దీనికి తోడు లీగ్ దశలోనే కాదు ఫస్ట్ సెమీస్‌లో అన్ని మ్యాచ్‌ల్లో గెలిచింది భారత్. తిరుగులేని ఫామ్‌తో ఉన్న రోహిత్ సేన ఈసారి ఆసీస్‌ను ఓడించి మూడోసారి ప్రపంచకప్‌ను గెలవడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్రమోడీతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు రానున్నారు. ఇదే వేదికగా భారత్ తరపున ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వారందరిని సత్కరించనుంది బీసీసీఐ.ప్రత్యేక సంగీత ప్రదర్శనలు ఉండనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -