- Advertisement -

భారీ వర్షం..తొలిరోజు ఆట వర్షార్పణం!

- Advertisement -

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట వర్షార్పణం అయింది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. 35 ఓవర్లలో 3 వికెట్లు కొల్పోయి 107 పరుగులు చేసింది బంగ్లా. ఈ క్రమంలో బారీ వర్షం పడటంతో తొలి రోజు ఆట సాధ్యపడలేదు.

ముష్ఫికర్ రహీమ్ (6 *), మొమినుల్ హక్ (40 *) క్రీజులో ఉన్నారు. వాస్తవానికి పేలవమైన వెలుతురు కారణంగా మ్యాచ్ ఒక గంట ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నారు.

బంగ్లాదేశ్ ఓపెనర్లు జాకీర్ హసన్, షాద్మన్ ఇస్లాం ఎక్కువ పరుగులు చేయకుండానే వెనుదిరిగారు. దీంతో 29 పరుగులకు రెండు వికెట్లు కొల్పోయింది బంగ్లాదేశ్. భారత బౌలర్లలో ఆకాష్ దీప్ 2 వికెట్లు తీశారు. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -