Thursday, May 16, 2024
- Advertisement -

విండీస్ టూర్ లో మూడు రికార్డులు బద్దలు కొట్టనున్న విరాట్ కోహ్లీ..

- Advertisement -

వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇప్పుడు వన్డే సిరీస్ పై గురి పెట్టింది. అయితే ఈ టూర్ లో అరుదైన రికార్డు ముంగిట కోహ్లీ నిలిచాడు. యానా వేదికగా గురువారం రాత్రి 7 గంటల నుంచి భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేస్తె… దశాబ్దాల నాటి రికార్డులు బద్దలుకానున్నాయి.

వన్డేల్లో వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రస్తుతం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ 1930 పరుగులతో నెం.1 స్థానంలో ఉండగా.. అతని తర్వాత విరాట్ కోహ్లీ 1912 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈరోజు జరగనున్న తొలి వన్డేలో కోహ్లీ మరో 19 పరుగులు చేస్తే పాక్ మాజీ క్రికెటర్ రికార్డు బద్దలవతుంది .

భారత్, వెస్టిండీస్ మధ్య ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా విండీస్‌కి చెందిన రామ్‌నరేష్ శర్వాన్.. 17 మ్యాచ్‌ల్లో 700 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లీ ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 556 పరుగులతో కొనసాగుతున్నాడు. మరో 144 పరుగులు సాధిస్తే అగ్రస్థానానికి ఎగబాకనున్నాడు.భారత్- వెస్టిండీస్ మధ్య కరీబియన్ గడ్డపై జరిగిన వన్డే సిరీస్‌ల్లో రెండు శతకాలు బాదిన క్రికెటర్‌గా విండీస్‌కి చెందిన ఓపెనర్ దేశ్‌మాండ్ హెన్స్‌‌ సరసన ప్రస్తుతం ఉన్న విరాట్ కోహ్లీ.. ఈరోజు వన్డేలో సెంచరీ సాధిస్తే అతని రికార్డును వెనక్కి నెట్టేయనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -