Wednesday, May 15, 2024
- Advertisement -

జైట్లీ మృతి తో కీలక నిర్ణయం తీసుకున్న టీమిండియా..

- Advertisement -

భాజాపా సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల యావత్‌ భారతావని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా జైట్లీ దేశానికి అందించిన సేవలను రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు స్మరించుకుంటున్నారు. క్రికెట్ తో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయి.

ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఆయన సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్‌కు సేవలందించారు. అంతేకాకుండా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో తీవ్ర కృషి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఆటగాళ్లు టీమిండియా తరుపున ఆడుతున్నారంటే అది జైట్లీ చలవే అని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

క్రికెట్ కు ఆయన చేసిన సేవకు గుర్తుగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.అరుణ్ జైట్లీ మృతికి సంతాపంగా వెస్టిండీస్‌తో ఈరోజు ఆడే మ్యాచ్‌లో టీం ఇండియా ఆటగాళ్లు చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగనున్నారు. అరుణ్ ‌జైట్లీ సేవలను గుర్తు చేసుకుంటూ నేడు వెస్టీండీస్‌తో జరిగే మ్యాచ్‌లో చేతికి నల్ల రిబ్బన్లు ధరించాలని టీం ఇండియా నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌదరి ఈ ఆలోచనను ప్రతిపాదించగా, దానికి వెంటనే కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్, సీఈఓ రాహుల్ జోహ్రీ మద్దతు ఇచ్చారని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -