Tuesday, May 21, 2024
- Advertisement -

నిల‌క‌డ‌గా ఆడుతున్న భార‌త్‌…

- Advertisement -

శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు నిల‌క‌డ‌గా ఆడుతోంది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇండియా త‌ర్వాత అఆచితూచి ఆడుతోంది. లంచ్ విరామ స‌మ‌యానికి 51/2తో నిలిచిన భార‌త్ త‌ర్వాత నిల‌క‌డ‌గా ఆడుతోంది. ప్ర‌స్తుతం ఇండియా స్కోరు 93/2 తో ఆట నిల‌క‌డ‌గా సాగుతోంది. పుజారా 40 (53) , ధావ‌ణ్ 31 (65) స్కోరుతో క్రీజులో ఉన్నారు.

ప్రస్తుతం టీమిండియా 248 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజు బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉన్న పిచ్‌ మంగళవారం పూర్తిగా మారిపోయింది. బౌలింగ్‌కు అనుకూలిస్తోంది. పరుగులు చేసేందుకు బ్యాట్స్‌మెన్‌ శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓపెనర్‌ మురళీ విజయ్‌ (9), అంజిక్య రహానె (10) త్వరగా పెవిలియన్‌ చేరారు.

అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 356/9తో ఆట ప్రారంభించిన పర్యాటక జట్టు 135.3 ఓవర్లకు 373 పరుగులకు ఆలౌట్‌ అయింది. లంక సారథి దినేశ్‌ చండిమాల్‌ (164; 361 బంతుల్లో 21×4, 1×6) కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు. వరుస బౌండరీలు బాది వూపు మీద కనిపించిన అతడు ఇషాంత్‌ శర్మ వేసిన 135.3వ బంతికి థర్డ్‌మ్యాన్‌ దిశలో ఫీల్డింగ్‌ చేస్తున్న ధావన్‌కు చిక్కాడు. సండకన్‌ (0; 20 బంతుల్లో) అజేయంగా నిలిచాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -