Monday, April 29, 2024
- Advertisement -

ముచ్చటగా మూడోసారి భారత్ – పాక్ మ్యాచ్!

- Advertisement -

ఆసియా కప్ 2023లో భాగంగా ఫైనల్‌కు చేరింది టీమిండియా. కీలక మ్యాచ్‌లో శ్రీలంకపై 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. భారత్ విధించిన 215 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేకపోయింది శ్రీలంక. ఇక గురువారం శ్రీలంక – పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్లో భారత్‌తో తలపడనున్నారు.

ఇక శ్రీలంకతో మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే మరోసారి దాయాదుల పోరు ఖాయం. ఇదే జరిగితే ఆసియా కప్ చరిత్రలోనే ఇది తొలిసారి కానుంది. ఇప్పటివరకు ఆసియా కప్ ఫైనల్ భారత్ – పాక్ తలపడింది లేదు. ఈ సిరీస్‌లో ఇప్పటికే పాక్‌తో రెండుసార్లు తలపడింది భారత్. ఓ సారి వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కాగా రెండోసారి భారత్ 200 పై చిలుకు తేడాతో పాక్‌ని చిత్తు చేసింది.

దాయాదుల పోరు జరగాలంటే పాక్ గెలవడం తప్పనిసరి. ఇక వరణదేవుడు కూడా కరుణించాల్సి ఉంటుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఫైనల్ కు చేరేందుకు శ్రీలంక జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాకిస్ధాన్ కంటే శ్రీలంక రన్ రేటు మెరుగ్గా ఉండటమే కారణం.

ఆసియా కప్ సూపర్-4లో నాలుగు జట్లు ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ప్రవేశించాయి. ఇండియా రెండు మ్యాచ్ లలో రెండు విజయాలు సాధించగా శ్రీలంక, పాకిస్థాన్ జట్లు రెండు మ్యాచ్ లలో ఒక్కో విజయంతో ఉన్నాయి. బంగ్లాదేశ్ జట్టు రెండు మ్యాచ్‌లను ఓడిపోయి ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కొల్పోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -