Sunday, May 19, 2024
- Advertisement -

సఫారీ గడ్డపై హెల్మెట్‌కి తగిలేలా బౌన్సర్లు.. రోహిత్ శ‌ర్మ‌….

- Advertisement -

జ‌న‌వ‌రి 5 నుంచి ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. స‌ఫారీ గ‌డ్డ‌పై మ్యాచ్‌లంటే క‌ష్టంతో కూడుకున్న ప‌ని. అక్క‌డ పిచ్‌ల‌న్నీ బౌన్సీ పిచ్‌లే. కేప్‌టౌన్ చేరుకున్న టీమిండియా ముమ్మ‌రంగా ప్రాక్టీస్ చేస్తోంది. స‌ఫారీ బైలింగ్‌ గురించి రోహిత్ శ‌ర్మ స్పందించారు.

స‌ఫారీల బౌలింగ్ దాడి చాలా ప్రమాదకరంగా ఉంటుందన్నారు. న్డే, టీ20ల్లో ఓపెనర్‌గా వచ్చే రోహిత్.. టెస్టుల్లో మాత్రం మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి వస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు జరగనుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల బౌలింగ్ అటాక్‌తో పోలిస్తే.. సఫారీ జట్టే మెరుగైందని రోహిత్ వివరించాడు.

ప్రపంచంలోనే దక్షిణాఫ్రికా బౌలింగ్ అటాక్ అత్యుత్తమైనది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బౌలింగ్ దాడిలో పదునుంటుంది.. కానీ.. దక్షిణాఫ్రికా బౌలర్లు ఇంకా ప్రమాదకరం. యువ బౌలర్ కగిసో రబాడ బ్యాట్స్‌మెన్ హెల్మెట్‌కి తగిలేలా బౌన్సర్లు విసురుతున్నాడు. సఫారీ బౌలర్లలో వెరైటీ ఎక్కువగా కనిపిస్తుంద‌న్నారు.

రబాడతో పాటు సీనియర్ బౌలర్లు మోర్నీ మోర్కెల్, డేల్ స్టెయిన్ కొత్త బంతితోనే కాదు.. పాత బంతితోనూ బ్యాట్స్‌మెన్‌ని ఉక్కిరిబిక్కిరి చేయగలరు. ఫిలాండర్‌ కూడా వారి సొంతగడ్డపై ప్రమాదకర బౌలరే. అందుకే దక్షిణాఫ్రికా బౌలింగ్‌ని ఎదుర్కోవడం భారత్ జట్టుకి ఓ సవాల్’ అని రోహిత్ శర్మ వివరించాడు. శుక్ర‌వారం నుంచి కేప్‌టౌన్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -