Monday, May 20, 2024
- Advertisement -

రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా… మార్క్రమ్‌ (94) వికెట్‌

- Advertisement -

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు ఆరంభ సెషన్‌లో భారత బౌలర్లకి నిరాశ ఎదురైంది. మ్యాచులో వికెట్ కోసం చెమ‌టోడ్చుతున్న టీమిండియా రెండో సెష‌న్‌లో ఫ‌లితం ల‌భించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. భారత బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ విసిరిన బంతికి మురళీ విజయ్‌కు క్యాచ్ ఇచ్చుకుని ఓపెనర్ డీన్ ఎల్గర్ 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా పటిష్ఠ స్థితికి చేరుకుంటోంది. అత్యంత నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది.ఆ జట్టు స్కోర్ ఇప్పుడు 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 164 పరుగులుగా ఉంది. ఓపెనర్లు ఎల్గార్, మార్‌క్రంలను భారత స్పిన్ బౌలర్ అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో 83 బంతులు ఆడిన ఎల్గార్ 31 పరుగులు (4 ఫోర్లు) చేయగా, 150 బంతులు ఆడిన మార్‌క్రం 94 పరుగులు (15 ఫోర్లు) చేశాడు.

వరుస బౌండరీలతో శతకానికి చేరువైన ఓపెనర్‌ మార్క్రమ్‌ (94; 150 బంతుల్లో 15×4)ను సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ పెవిలియన్‌కు పంపించాడు. అశ్విన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 47.3వ బంతిని సరిగ్గా అంచనా వేయని మార్క్రమ్‌ ఆఫ్‌సైడ్‌ డిఫెన్స్‌ చేయబోయాడు. బ్యాట్‌ అంచును ముద్దాడిన బంతి కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ చేతుల్లో పడింది. బంతి ప్యాడ్లను తాకిందనుకున్న మార్క్రమ్‌ అంపైర్‌ను సమీక్ష కోరాడు. అందులో బ్యాటును తాకినట్లు తేలడంతో మైదానం వీడాడు

ప్రస్తుతం ఆమ్లా (62 బంతుల్లో 30 పరుగులు, 6 ఫోర్లు), డివిలియర్స్ (6 బంతుల్లో 7 పరుగులు, 1 ఫోర్)లు క్రీజ్‌లో ఉన్నారు. కాగా మొదటి రోజు ఆటలో ఇంకా 40 ఓవర్లు మిగిలి ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -