Saturday, May 18, 2024
- Advertisement -

సౌతాఫ్రికాను 194 ప‌రుగుల‌కే కుప్ప‌కూల్చిన భార‌త్‌…

- Advertisement -

భార‌త్ తో జ‌రుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 194 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. ఆమ్లా, ర‌బ‌డ మిన‌హా మిగిలిన బ్యాట్స్ మెన్లు ఎవ‌రు రాణించ‌క‌పోవ‌డంతో భార‌త్ కంటే 7 ప‌రుగులు మాత్రమే ఎక్కువ‌ చేసింది. భార‌త్ బౌల‌ర్ల‌లో బూమ్రా 5 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, భువ‌నేశ్వ‌ర్ మూడు , ష‌మి, ఇశాంత్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు. అంత‌కుముందు భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 187 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే.

బుమ్రా చెలరేగి బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. దీంతో దక్షిణాఫ్రికాను భారత్ 194 పరుగలకే కట్టడి చేసింది. భారత బౌలర్లు విసురుతోన్న బంతుల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ఆమ్లా 61, ఫిలండెర్ 35, రబాడా 30 మినహా ఇతర ఏ బ్యాట్స్ మెన్ రాణించలేకపోయారు. ఎల్గర్ 4, మార్క్ రం 2, డివిల్లియర్స్ 5, డుప్లెసిస్ 8, డి కాక్ 8, ఆండిలె 9, మార్కెల్ 9 (నాటౌట్), ఎన్గిడి 0 పరుగులు చేశారు.

గురువారం ఆరంభ ఓవర్లలోనే డీన్ ఎల్గర్ (4) వికెట్ తీసి సఫారీలకి భువనేశ్వర్ కుమార్ షాకివ్వగా.. నైట్ వాచ్‌మెన్ రబాడని ఇషాంత్ శర్మ బోల్తా కొట్టించాడు. అనంతరం వచ్చిన ఏబీ డివిలియర్స్ (5) భువనేశ్వర్ బంతిని సరిగ్గా అంచనా వేయలేక వికెట్ సమర్పించుకోగా.. కెప్టెన్ డుప్లెసిస్ (8), డికాక్ (8)లను జస్‌ప్రీత్ బుమ్రా క్రీజులో కుదురుకోనీయకుండా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో తక్కువ స్కోరుకే దక్షిణాఫ్రికా పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. ఒక ఎండ్‌లో క్రీజులో పాతుకుపోయిన హసీమ్ ఆమ్లా.. టెయిలెండర్ల సాయంతో జట్టు స్కోరు బోర్డుని నడిపించాడు. చివర్లో మళ్లీ బుమ్రానే ఆమ్లాని ఔట్ చేయగా.. ఫిలాండర్ కాసేపు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు.

భారత బౌలర్లలో బుమ్రాకి ఐదు వికెట్లు దక్కగా, భువనేశ్వర్ కుమార్‌కి 3, ఇషాంత్ శర్మ, షమీలకు తలో ఒకటి వికెట్లు దక్కాయి. కాగా, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 187 పరుగుల చేసిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా కన్నా భారత్ 7 పరుగులు వెనకబడి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -