- Advertisement -

వ‌న్డే మ్యాచ్‌ల ఆరంభానికి ముందే స‌ఫారీల‌కు ఎదురు దెబ్బ‌..

- Advertisement -

భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 2-1 తేడాతో గెలుపొందిన దక్షిణాఫ్రికాకు వన్డే సిరీస్ ఆరంభానికి ముందే షాక్ తగిలింది. తొలి మూడు వన్డేలకు స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ దూరమయ్యాడు. చేతి వేలి గాయంతో ఏబీ మూడు మ్యాచ్‌లకు దూరం అయ్యాడని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. అతడి స్థానంలో మరో ఆటగాడి పేరును మాత్రం ప్రకటించలేదు.

చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ ఇచ్చిన కష్టమైన క్యాచ్‌ను అందుకునే క్రమంలో డివిలియర్స్ గాయపడ్డాడు. గాయంతోనే అతడు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. కానీ చాలాసేపు ఫీల్డింగ్ చేయలేకపోయాడు. డివిలియర్స్ కుడి చేతి చూపుడు వేలికి గాయమైంది. కోలుకోవడానికి రెండు వారాల సమయం అవసరం అని క్రికెట్ దక్షిణాఫ్రికా తెలిపింది. ఫిబ్రవరి 10న జరగనున్న పింక్ వన్డే సమయానికి అందుబాటులోకి వస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

33 ఏళ్ల డివిలియర్స్‌కు భారత్‌పై అద్భుతమైన బ్యాటింగ్ రికార్డ్ ఉంది. టీమిండియాపై 29 మ్యాచ్‌ల్లో 52 సగటుతో 1295 పరుగులు చేశాడు. వాటిలో ఆరు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇటీవల ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో 211 పరుగులు చేసిన ఏబీ.. సౌతాఫ్రికా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

ఫిబ్రవరి 10న జరగబోయే పింక్‌ వన్డే(నాలుగో వన్డే) సమయానికి డివిలియర్స్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్‌, దక్షిణాఫ్రికాల మధ్య జరిగే ఆరు వన్డేల సిరీస్‌లో తొలి వన్డే ఫిబ్రవరి 1న కింగ్స్‌మీడ్‌ మైదానంలో జరుగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -