Saturday, May 18, 2024
- Advertisement -

టాస్ గెలిచి కోహ్లీసేన‌పై బౌలింగ్ ఎంచుకున్న ధోనీ…..

- Advertisement -

పీఎల్-11లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోసారి తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో ధోనీసేన ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. శనివారం పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సారథి మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.

టోర్నీలో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లాడిన చెన్నై జట్టు ఏకంగా ఆరింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు 8 మ్యాచ్‌లాడిన బెంగళూరు జట్టు ఐదింట్లో ఓడి.. ప్రస్తుతం ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా గత గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా ఓటమి చవిచూసిన చెన్నై జట్టు.. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌కి మరింత చేరువ కావాలని ఆశిస్తోంది. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సూపర్ ఫామ్‌‌ని కొనసాగిస్తూ డెత్ ఓవర్లలో అత్యుత్తమ ప్రదర్శనతో స్కోరుని అమాంతం పెంచేస్తున్నాడు.

కోహ్లి సారథ్యంలోని బెంగళూరు జట్టు గత మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి గెలిచిన తీరు ఆ జట్టు ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసింది. ముఖ్యంగా టోర్నీ ఆరంభం నుంచి విఫలమైన బౌలర్లు.. ఆ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. మరో ఓపెనర్/ వికెట్ కీపర్ డికాక్.. దక్షిణాఫ్రికాలో ఓ వివాహ వేడుకకి హాజరయ్యేందుకు అక్కడికి వెళ్లడంతో ఈ మ్యాచ్‌కి దూరమయ్యాడు. కానీ.. జ్వరం కారణంగా గత రెండు మ్యాచ్‌లకీ దూరమైన హిట్టర్ ఏబీ డివిలియర్స్ ఫిటెనెస్ సాధించి మళ్లీ బెంగళూరు తుది జట్టులోకి రావడం ఆ జట్టుకి పెద్ద ఉపశమనం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -