Saturday, May 18, 2024
- Advertisement -

జ‌ట్టులో మార్పులు త‌ప్ప‌వు కోహ్లీ….

- Advertisement -

ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ఆర్సీబీని ద‌రిద్రం వెంటాడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన నాలుగుమ్యాచ్‌ల్లో ఓట‌మి పాల‌య్యి పాయంట్ల ప‌ట్టిక‌లో చివ‌రిస్థానంలో ఉంది. మంగళవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి చవి చూసిందీ జట్టు. హేమాహేమీలున్నా ఎవరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో బెంగళూరుపై రాజస్థాన్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓట‌ముల‌పై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు.

జ‌ట్టులో మార్పులు త‌ప్ప‌వ‌ని తెలిపారు. ఈరోజు మేము గట్టి పోటీ ఇచ్చామనే భావిస్తున్నా. మరో 15- 20 పరుగులు చేసి ఉంటే బాగుండేది. మేము చేసిన కొన్ని తప్పుల వల్ల విజయం కోసం ఇంకా ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.జ‌ట్టు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంద‌ని.. ఓటములపై మేమంతా కలిసి చర్చిస్తాం. జట్టులో సమతూకం కోసం ఏ చర్యలైనా తీసుకుంటామ‌న్నారు. కొత్త ఆటగాళ్లను జట్టులో తీసుకునే అవకాశాలున్నాయి. జట్టు కూర్పు ముఖ్యమైన విషయం కాబట్టి జట్టులో నిరూపించుకున్నవాళ్లకే అవకాశం దక్కుతుందని సెల‌విచ్చారు.

రంభం బాగుండనంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మాలో ఇంకా పోరాట పటిమ మిగిలే ఉంది. ఆటాగాళ్లు ఎవ‌రూ ఆత్మ‌విశ్వాసం కోల్పోవ‌ద్దు. విజయానికి కావాల్సిన వ్యూహాలు రచిస్తాం. మమ్మల్ని మేము మెరుగుపరచుకుని రానున్న మ్యాచ్‌లలో గెలుస్తామనే నమ్మకం ఉంది’ అని వ్యాఖ్యానించాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -