Monday, May 20, 2024
- Advertisement -

ప్రపంచకప్‌లో రచిన్ రవీంద్ర సంచలనం

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భారత సంతతి ఆటగాడు, కివీస్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర సంచలనం సృష్టించాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటాడు. ఇక రచిన్ రవీంద్రకు ఇది తొలి ప్రపంచకప్ కాగా అద్వితీయ ప్రతిభను చాటుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర.. మూడు సెంచరీలతో కొత్త రికార్డ్

ఆడుతున్న ఫస్ట్ వరల్డ్ కప్ లోనే మూడు సెంచరీలు చేసి రికార్డుకెక్కాడు. మొదటి ప్రపంచకప్ ఆడుతూ ఒక ఆటగాడు మూడు సెంచరీలు చేయడంతో ఇదే తొలిసారి, రికార్డు కూడా. పాక్‌తో జరుగుతున్న మ్యాచ్లో 94 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్ తో 108 పరుగులు చేశాడు. రచిన్, కెవిన్ రాణించడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా దూసుకు పోతోంది.

ఇక రచిన్ రవీంద్ర అంతకుముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో సెంచరీలు బాదాడు. అలాగే అరంగేట్రం ప్రపంచకప్‌లో 500 ప్లస్ పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ఇక రచిన్ కంటే ముందు 1975లో గ్లెన్ టర్నర్, 2015లో మార్టిన్ గప్టిల్,2019లో కేన్ విలియమ్సన్ ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు చేయగా రచిన్ మూడు సెంచరీలతో ఆ రికార్డును చెరిపేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -