Thursday, May 16, 2024
- Advertisement -

రికార్డుల రారాజు..రోహిత్

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆఫ్ఘాన్ విధించిన 273 పరుగుల లక్ష్యాన్ని కేవలం 35 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కొల్పోయి చేధించి పాయింట్ల పట్టికలో రన్‌రేట్ పరంగా రెండో స్ధానంలో నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ పలు రికార్డులను నమోదుచేశాడు,

భారత్‌ తరఫున వన్డే ప్రపంచకప్‌లో ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ కాగా మెగాటోర్నీలో రోహిత్‌కు ఇది ఏడో సెంచరీ. ఈ శతకంతో సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు రోహిత్…సచిన్‌ 6 ప్రపంచకప్‌లు ఆడి.. ఆరు శతకాలు తన పేరిట లిఖించుకోగా.. రోహిత్‌ కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ రికార్డు బద్దలు కొట్టి అగ్రస్థానానికి చేరాడు.

అలాగే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు రోహిత్. అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి రోహిత్ 473 ఇన్నింగ్స్‌ల్లో 554 సిక్స‌ర్లు బాదాడు. క్రిస్‌గేల్ 551 ఇన్నింగ్స్‌ల్లో 553 సిక్స‌ర్లు కొట్టాడు. గేల్ తర్వాత షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్‌) – 476,బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్‌) – 398,మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్‌) – 383 ఉన్నారు. అలాగే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్‌తో క‌లిసి సంయుక్తంగా అగ్ర‌స్థానంలో నిలిచాడు. వార్న‌ర్‌, రోహిత్‌లు చెరో 19 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -