Sunday, May 5, 2024
- Advertisement -

మూడేళ్ల త‌ర్వాత పేవ‌ల‌మైన ఫామ్‌ను కొన‌సాగిస్తున్న రోహిత్ శ‌ర్మ‌..

- Advertisement -

స‌ఫారీ టూర్‌లో హిట్ట‌ర్ రోహిత్ శ‌ర్మ ఫేవ‌ల‌మైన ఆట‌తీరును కొన‌సాగిస్తున్నారు. వరుస మ్యాచ్‌ల్లో విఫలం అవుతోన్న రోహిత్.. జొహెన్నస్‌బర్గ్‌లో జరుగుతోన్న నాలుగో వన్డేలోనూ 5 పరుగులకే అవుటై నిరాశ పరిచాడు.టెస్టు సిరీస్‌లో రోహిత్ విఫలం కావడం భారత విజయాలపై ప్రభావం చూపింది.

సఫారీ గడ్డ మీద రోహిత్ శర్మ పేలవ ఆటతీరు కొనసాగుతోంది. వరుస మ్యాచ్‌ల్లో విఫలం అవుతోన్న రోహిత్.. జొహెన్నస్‌బర్గ్‌లో జరుగుతోన్న నాలుగో వన్డేలోనూ 5 పరుగులకే అవుటై నిరాశ పరిచాడు. టెస్టు సిరీస్‌లో రోహిత్ విఫలం కావడం భారత విజయాలపై ప్రభావం చూపింది. వన్డే సిరీస్‌లో కోహ్లి, మణికట్టు బౌలర్లు రాణిస్తుండటంతో భారత్ గెలుపొందుతోంది. కానీ హిట్ మ్యాన్ మాత్రం వైఫల్యాల బాట వీడటం లేదు.

తొలి వన్డేలో 20 పరుగులు చేసిన రోహిత్, రెండో మ్యాచ్‌లో 15 రన్స్ చేశాడు. మూడో వన్డేలో డకౌట్ అయ్యాడు. రోహిత్ శర్మ వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీ చేయలేకపోయాడు. 2014 జనవరి తర్వాత రోహిత్ ఇంత దారుణంగా విఫలం కావడం ఇదే తొలిసారి.

రోహిత్ యావరేజ్ 44.54 ఉండగా.. సఫారీ గడ్డ మీద 11 మ్యాచ్‌ల్లో 12 సగటుతో 121 పరుగులు చేశాడు. ఏ దేశంలోనైనా కనీసం పది మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్లలో అతి తక్కు యావరేజ్ రోహిత్‌దే కావడం గమనార్హం. వరుసగా విఫలం అవుతున్నప్పటికీ.. అద్భుత శతకం ద్వారా హిట్ మ్యాన్ ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -