Saturday, May 18, 2024
- Advertisement -

తండ్రికి త‌గ్గ‌ త‌న‌యుడంటూ అర్జున్ టెండుల్‌క‌ర్‌పై ఆసీస్ మీడియా ప్ర‌శంశ‌లు…

- Advertisement -

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ గురించి ఆసీస్‌ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. తండ్రికి త‌గ్గ త‌న‌యుడంటూ పొగ‌డ్త‌ల్లో ముంచెత్తింది. ఎందుక‌నుకుంటున్నారా…? అర్జున్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన గురించి. అర్జున్‌ నాలుగు ఓవర్లకి నాలుగు వికెట్లు తీయడంతో అందరితో పాటు ఆసీసీ మీడియా మామూలుగా లేపట్లదు.

స్తుతం అర్జున్‌ ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్‌ మైదానం ఆధ్వర్యంలో జరుగుతోన్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. లీగ్‌లో భాగంగా బ్రాడ్‌మన్‌ ఓవల్‌ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచులో అర్జున్‌ తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. 4 ఓవర్లలో నాలుగు వికెట్లు తీయడంతోపాటు 27 బంతుల్లో 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

స్పిరిట్ ఆఫ్ క్రికెట్ గ్లోబల్ ఛాలెంజ్ లో భాగంగా హాంకాంగ్ క్రికెట్ క్లబ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో క్రికెట​ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా తరపున బరిలోకి దిగిన అర్జున్ 27 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగిన బౌండరీలతో విరుచుకుపడ్డాడు.

దీంతో ఆస్ట్రేలియా మీడియా సైతం అర్జున్ ఆటతీరును మెచ్చుకుంది. తాజాగా అర్జున్‌ ఓ మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ‘దిగ్గజ ఆటగాడు బ్రాడ్‌మెన్‌ పేరిట ఉన్న ఓవల్‌ మైదానంలో ఆడటం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. చిన్నప్పటి నుంచి నాకు ఫాస్ట్‌ బౌలింగ్‌ అంటే ఇష్టం. మిచెల్‌ స్టార్క్‌(ఆస్ట్రేలియా), బెన్‌ స్టోక్స్‌(ఇంగ్లాండ్‌) నా అభిమాన ఆటగాళ్లు. మరింత దృఢంగా వీలైనంత త్వరగా గొప్ప ఫాస్ట్‌ బౌలర్‌గా ఎదగాలి.’ అని తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

భయం లేకుండా ఆడు. నీ జట్టు కోసం ఆడు. ఆటగాడిగా నువ్వు జట్టుకు ఎంత సాయం చేయగలవో అంతవరకు చెయ్యి’ అని నా తండ్రి ఎప్పుడూ చెప్తుంటారు. దీనివల్ల నేను ఎలాంటి ఒత్తిడికి గురవ్వను. బౌలింగ్‌ చేస్తున్నంత సేపు.. బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధించకుండా బంతులేయాలి అని, బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాల‌ని ఆలోచిస్తాన్నారు. అర్జున్‌ ప్రదర్శనపై ఆసీస్‌ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. క్రికెట్‌ దిగ్గజ ఆటగాడు సచిన్‌కు తగ్గ తనయుడు అంటూ కొనియాడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -