Thursday, May 16, 2024
- Advertisement -

సచిన్ కూతురు పేరిట సోషల్ మీడియాలో న‌కిలీ అస‌భ్య‌ పోస్టులు.. టెకీ అరెస్ట్‌

- Advertisement -

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ పేరు మీదుగా నకిలీ ట్విటర్‌ ఖాతా నడుపుతున్న వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత కొంతకాలంగా ఆ ట్విట్టర్ ఖాతా నుంచి అభ్యంతకర పోస్టులు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని అంధేరికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ నితిన్‌ సిశోడే(39) సారా పేరు మీదుగా నకిలీ ఖాతా నడుపుతున్నాడు. దాని ద్వారా కొందరు రాజకీయ నాయకులను కించపరిచేలా పోస్టులు పెడుతున్నాడు. న కూతురు సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్ ల పేరిట ఉన్న ఫేస్‌బుక్, ట్వీటర్ ఖాతాలు నకిలీవని అసలు వారికి సోషల్ మీడియా అకౌంట్లు లేవని.. కొందరు అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ సంబంధిత సంస్థలకు సచిన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

సచిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అతనిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఒక ల్యాప్‌టాప్‌, రెండు మొబైల్‌ ఫోన్లు, రూటర్‌, ఇతర కంప్యూటర్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై చీటింగ్, పరువు నష్టం తదితర కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా ఫిబ్రవరి 9వ తేదీ వరకు పోలీస్‌ కస్టడీ విధించారు.

తన కూతురు సారా టెండూల్కర్, కుమారుడు అర్జున్ టెండూల్కర్ ల పేరిట ఉన్న నకిలీ ట్విట్టర్ ఖాతాలను తొలగించాలని ట్విట్టర్ సంస్థను కోరుతూ గతంలో సచిన్ వరుస ట్వీట్లు చేశారు. తన కూతురు, కుమారుడికి ట్విట్టర్ లో అసలు ఖాతాలే లేవని.. వీలైనంత త్వరగా వారి పేర్లమీద ఉన్న అన్ని ఖాతాలను తొలగించాలని ట్వీట్ లో రాసుకొచ్చారు. అర్జున్, సారాల పేర్లతో ఉన్న నకిలీ ఖాతాల నుంచి లేనిపోని విషయాలు, తప్పుడు సమాచారం పోస్ట్ అయితే పరిస్థితి మరోలా ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -