Sunday, May 19, 2024
- Advertisement -

రెండు వికెట్లు కోల్పోయి నిల‌క‌డ‌గా ఆడుతున్న శ్రీలంక‌…

- Advertisement -

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్న్‌లో శ్రీలంక వెంటవెంటనే రెండు వికెట్లు చేజార్చుకుంది. ఐదు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు దిముతు కరుణరత్నె (8; 15 బంతుల్లో 1×4), సమర విక్రమ (23; 22 బంతుల్లో 3×4)ను టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ పెవిలియన్‌ పంపించాడు.

రెండు వికెట్లు కోల్పోయినా శ్రీలంక నిల‌క‌డ‌గా ఆడుతోంది. పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుండడంతో ఏమాత్రం తొందరపడకుండా ఆడుతున్నారు. లంక ఇన్నింగ్స్ ను సమరవిక్రమ (23) కరుణరత్నె (8) ప్రారంభించారు. అద్భుతమపైన ఇన్ స్వింగర్ తో కరుణరత్నెను ఎల్బీడబ్ల్యూ చేసిన భువనేశ్వర్ కుమార్, సమరవిక్రమ బలహీనతను సొమ్ము చేసుకుని, ఊరించే బంతిని వేసి కీపర్ క్యాచ్ ద్వారా పెవిలియన్ కు పంపాడు.

ఇద్దరూ క్రీజులో నిల్చొనేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో రెండో సెషన్ లో బ్యాటింగ్ శ్రీలంక జట్టు రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కంటే 108 పరుగులు వెనకబడి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -