Thursday, May 16, 2024
- Advertisement -

విరాట్, స్మిత్ లలో ఎవరు గొప్పో చెప్పిన షేన్ వార్న్….

- Advertisement -

యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఆసిస్ ఆటగాడు స్మిత్ పరుగుల వరద పారిస్తున్నారు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ జరుగుతున్న నాల్గో టెస్టులో స్మిత్‌(211) డబుల్‌ సెంచరీతో మెరిశాడు. హాఫ్‌ సెంచరీ, సెంచరీలను ఏకంగా డబుల్‌ సెంచరీగా మలుచుకుని ఆసీస్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు.తొలి టెస్టులో (144, 142), రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు స్మిత్‌. స్మిత్ పై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కోహ్లీ,స్మిత్ ఇద్రరిలలో ఎవరు బెస్ట్ అనేదానికి ఆసిస్ మాజీ ఆటాడు షేన్ వార్న్ ఆసక్తిగా బదులిచ్చారు.స్మిత్‌ కేవలం టెస్టు ఫార్మాట్‌లో మాత్రమే అత్యుత్తమ ఆటగాడని, కోహ్లి మూడు ఫార్మాట్లలో మేటి అని వార్న్‌ పేర్కొన్నాడు. ఇటీవల కోహ్లి నుంచి నంబర్‌ టెస్టు ర్యాంకును లాగేసుకున్న స్మిత్‌.. టెస్టుల్లో సెంచరీల పరంగా కోహ్లిని దాటేశాడు.

టెస్టుల్లో స్మిత్, కోహ్లీ ఎవరు అత్యుత్తమంటే ఇద్దరిలో ఎవరు గొప్పో చెప్పడం కష్టమన్నారు. ఎవర్నో ఒకరిని ఎంచుకోవాలంటే స్మిత్ వైపు కాస్త మొగ్గు చూపుతానన్నారు. అన్ని ఫార్మెట్ లల్లోను నేను కోహ్లీనీ అత్యుత్తమ ఆటగాడుగా ఎంచకుంటా.అన్ని ఫార్మాట్లలో కోహ్లి పరుగుల వరద పారిస్తాడు. ఇక్కడ స్మిత్‌ కేవలం అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్‌ మాత్రమే అంటూ సమాధానం ఇచ్చారు.

కోహ్లి ఒక లెజెండ్‌ క్రికెటర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సచిన్‌ టెండూల్కర్‌ 100 సెంచరీలు రికార్డును కోహ్లినే బ్రేక్‌ చేస్తాడు’ అని వార్న్‌ తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తాను చూసిన గ్రేటెస్ట్‌ ప్లేయర్‌ ఎవరైనా ఉన్నారంటే అది కోహ్లినేనని పేర్కొన్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -