Thursday, May 16, 2024
- Advertisement -

కోహ్లీకి మళ్లీ కెప్టెన్సీనా…? సెలక్షన్‌ కమిటీపై మండిపడ్డ గవాస్కర్….

- Advertisement -

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీపై మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్టును ప్రకటించే క్రమంలో సెలక్షన్‌ కమిటీ తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడు పార్మెట్ లకు కోహ్లీనె కెప్టెన్ గా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక కుంటి బాతు సెలక్షన్‌ కమిటీలా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వెస్టిండీస్‌తో ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ లకు కోహ్లీనె కెప్టెన్ గా నిర్ణయం తీసుకున్నారు సెలక్టర్లు. ప్రపంచకప్‌లో జట్టుని విజేతగా నిలపలేకపోయిన విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కనీసం చిన్న సమీక్ష కూడా జరపకుండానే మళ్లీ సెలక్టర్లు అతనికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడంపై గవాస్కర్ మండిపడ్డాడు.

మూడు ఫార్మాట్లకు అతనే కెప్టెన్‌ ప్రకటించడంపై అనేక ప్రశ్నలకు తావిచ్చారన్నారు బీసీసీఐ సెలక్టర్లు. సెలక్షన్‌ కమిటీ నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా.. లేక కోహ్లి నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా అనే విమర్శలు వచ్చాయి. వరల్డ్‌కప్‌లో అంచనాల్ని అందుకోలేకపోయిన దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్‌పై వేటు వేశారు.. మరి కెప్టెన్‌గా ఫెయిలైన విరాట్ కోహ్లీపై చర్యలుండవా..? అని ప్రశ్నించారు. వరల్డ్‌కప్‌ ఫెయిల్యూర్ తర్వాత కూడా కోహ్లీని ఆటోమేటిక్‌గా కెప్టెన్‌గా ఎంపిక చేయడాన్ని గవాస్కర్ తప్పుబట్టారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -