Saturday, May 18, 2024
- Advertisement -

క్రికెట్ ప్ర‌పంచంలో విరాట్ కోహ్లీనే బెస్ట్‌…

- Advertisement -

స‌ఫారీ టూర్‌లో కోహ్లీ నాయ‌క‌త్వంలో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయినా వ‌న్డే, టీ 20 సిరీస్‌ల‌ను గెలిచి టూర్‌ను విజ‌య‌వంతంగా ముగించింది. ఈ టూర్‌లో విరాట్ ప‌రుగుల వ‌ద‌ర‌ను పారించాడు. దీంతో ప్ర‌శంశ‌ల జ‌ల్లు కురిపించారు మాజీ ఆట‌గాళ్లు.

తాజాగా విరాట్‌ను ప్ర‌శంల్లో ముంచెత్తారు టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్ల‌ల‌లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న కోహ్లీనే బెస్ట్ అని కొనియాడారు. దక్షిణాఫ్రికా గడ్డపై ఇటీవల ముగిసిన సుదీర్ఘ సిరీస్‌లో కోహ్లి మొత్తం నాలుగు శతకాలు సాధించి.. ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో సఫారీలపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచారు.

సుదీర్ఘకాలంగా భారత్ జట్టు ఒక సిరీస్‌ని కూడా సఫారీ గడ్డపై గెలవలేకపోగా.. మూడు టెస్టుల సిరీస్‌ని 1-2తో చేజార్చుకున్నా టీమిండియా.. ఆరు వన్డేల సిరీస్‌ని 5-1తో, మూడు టీ20ల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకుని సగర్వంగా స్వదేశంలో ఇటీవల అడుగుపెట్టింది.

విరాట్ కోహ్లి, మహేంద్రసింగ్ ధోనీ.. ఇద్దరిదీ భిన్నమైన స్వభావ‌మ‌న్నారు . మైదానంలో కోహ్లి చాలా దూకుడుగా ఉంటే ధోనీ మాత్రం కూల్‌గా ఉంటార‌న్నారు. జట్టు కష్టాల్లో నిలిచిన దశలో కోహ్లీ నుంచి సాధికారిత ఇన్నింగ్స్‌ వస్తోంది. ఇక మహేంద్రసింగ్ ధోనీది చాలా నెమ్మది స్వభావం. సహచర ఆటగాడి ఒత్తిడిని దూరం చేసేందుకు తానే ముందుకు వచ్చి బాధ్యతలు తీసుకునేందుకు ఏమాత్రం అతను వెనుకంజవేయడు.

ఇప్పుడు విరాట్ కోహ్లి అద్భుతమైన ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో అతనే బెస్ట్ ఆటగాడు. కెప్టెన్‌‌గానూ మైదానంలో కోహ్లి చాలా నిజాయతీగా ఉంటాడు. కచ్చితంగా భారత క్రికెట్‌ను అతను మరో స్థాయికి తీసుకెళ్లగలడు’ అని గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -