టీమిండియా యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఓ రికార్డులో దిగ్గజాల సరసన తన పేరును లిఖించుకున్నాడు. అదేమిటంటే… ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆఖరి టెస్టుతో, టెస్టుల్లో అడుగుపెట్టిన ఈ తమిళ కుర్రాడు గాబా స్టేడియంలో 62 పరుగులు చేసి అర్ధ శతకం చేశాడు. రహానే సారథ్యంలోని భారత జట్టు కీలక విజయంలో తను కూడా కీలక పాత్ర పోషించాడు.
తద్వారా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి రెండు టెస్టుల జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే అనూహ్యంగా మ్యాచ్ ఆరంభానికి ముందు అక్షర్ పటేల్ మోకాలి నొప్పితో జట్టుకు దూరం కావడంతో, ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌కు ఆడే అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న వాషింగ్టన్ సుందర్, టీమిండియా కష్టాల్లో ఉన్న వేళ హాఫ్ సెంచరీతో మంచి స్కోరు సాధించేలా చేశాడు.
అలా విదేశంలో, స్వదేశంలో ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లోనే అర్ధ శతకం బాదిన ఎనిమిదో భారత క్రికెటర్‌గా నిలిచాడు. మాజీ ఆటగాళ్లు రుసీ మోదీ, సురీందర్ అమర్‌నాథ్, అరుణ్‌లాల్, టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్ సరసన సుందర్ చేరాడు. ఇక సోమవారం నాటి ఆటలో మొత్తంగా అతడు 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కెప్టెన్ కోహ్లి, యాజమాన్యం తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాషింగ్టన్ వమ్ము చేయలేదని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
యాంకర్ ప్రదీప్ నెల సంపాదన ఎంతో తెలుసా?
రాజుగారి ఇంట్లోకి కోడలిగా.. బడా బిజినెస్‌మెన్ కూతురు!
సిక్సు కొడితే రూ.వేయి.. మంత్రి హరీష్ రావు ప్రకటన..!