Saturday, April 20, 2024
- Advertisement -

డూ ఆర్ డై .. గెలిచేదెవ్వరు ?

- Advertisement -

సుదీర్ఘ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ లో ఉన్న టీమిండియా ఇప్పటికే టెస్ట్ సిరీస్, టి20 సిరీస్ ను పూర్తి చేసుకుంది.. టెస్ట్ సిరీస్ ను ఇంగ్లాండ్ ఎగరేసుకుపోతే.. టి20 సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇక మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో ఇప్పటికే ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. దాంతో ఇవాళ జగరనున్న చివరి వన్డే మ్యాచ్ కీలకంగా మారానుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు వన్డే సిరీస్ ను కైవసం చేసుకోనుంది. మొదటి మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమిండియా అదే జోరును రెండవ మ్యాచ్ లో కొనసాగించలేక పోయింది. మొదటి మ్యాచ్ లో ముఖ్యంగా టీమిండియా బౌలర్లు అద్బుత ప్రదర్శన కనబరిచారు. బుమ్రా 6 వికెట్లు తీసి ఏకంగా కెరియర్ బెస్ట్ గణాంకాలను నమోదు చేశాడు.

ఇక రెండవ మ్యాచ్ లో కూడా బౌలర్ల ప్రదర్శన పర్వాలేదనిపించినప్పటికి.. బ్యాట్స్ మెన్స్ మాత్రం సమిష్టిగా విఫలం కావడంతో ఇంగ్లీష్ జట్టు పైచెయ్యి సాధించింది. దీంతో మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రా ఫోర్డ్ వేదికగా జరిగే చివరి మ్యాచ్ పై అందరి దృష్టి నెలకొంది. ఇక ఈ మ్యాచ్ కొరకు టీమిండియాలో పెద్దగా మార్పులేమి కనిపించక పోవచ్చు. గడిచిన రెండు మ్యాచ్ లలోనూ టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. దాంతో బౌలింగ్ లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేకపోవచ్చు కానీ బ్యాటింగ్ పరంగా ఆలోచిస్తే మార్పులు కనిపించే అవకాశం ఉంది.

కేవలం వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన శిఖర్ ధావన్ రెండు మ్యాచ్లలోను ఆశించిన పరుగులు రాబట్టలేకపోయాడు. దాంతో అతడి స్థానంపై అనుమానాలు ఉన్నాయి. ఇక విరాట్ కోహ్లీ కూడా వరుస వైఫల్యాలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో చివరి వన్డేలో కోహ్లీ కి రెస్ట్ ఇస్తారా ? లేక కొనసాగిస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇంగ్లండ్ జట్టు కూర్పు లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. మ్యాచ్ ఈరోజు ( జూలై 17) మద్యాహ్నం 3:30 లకు ప్రారంభం కానుంది. ఇక సిరీస్ పూర్తి అయిన తరువాత టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు సిద్దమవ్వాల్సి ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -