టీమిండియా కు బ్రేక్.. ఇక డూ ఆర్ డై మాత్రమే !

- Advertisement -

ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్నా మూడు వన్డే సిరీస్ రెండవ మ్యాచ్ లో రోహిత్ సేన ఘోర ఓటమి చవిచూసింది. మొదటి మ్యాచ్ లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా..రెండవ మ్యాచ్ లో అదే జోరు కొనసాగించలేకపోయింది. ముఖ్యంగా టీమిండియా బ్యాటింగ్ విభాగం సమిష్టిగా విఫలం కావడంతో ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ రెండవ మ్యాచ్ లో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌట్ గా నిలిచింది. టీమిండియా బౌలర్ల కట్టడితో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ భారీ స్కోర్ చేయడానికి తడబడ్డారు. .

ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ లో మొయిన్ అలీ 47 పరుగులు, డేవిడ్ విల్లే 41 పరుగులతో రాణించిన మిగతా బ్యాట్స్ మెన్స్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఇక మన బౌలర్ల విషయానికొస్తే .. చహల్ నాలుగు వికెట్లతో విజృంబించగా, బుమ్రా, షమి, ప్రసిద్ద్ కృష్ణ వంటి వారు ఒక్కో వికెట్ తీసి ఇంగ్లాండ్ ను తక్కువ స్కోర్ కే పరిమితం చేశారు. ఇక 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఏ దశలోకు లక్ష్య ఛేదన వైపుగా కనిపించలేదు. టీమిండియా బ్యాట్స్ మెన్స్ వరుసకట్టి పెవిలియన్ చేరడంతో ఇండియా ఓటమికి చేరువైంది.12 వ ఓవర్లోనే టీమిండియా ఓటమి దాదాపు ఖరారైంది.. రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి వారు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు..

- Advertisement -

ఇక మొదటి మ్యాచ్ లో గాయం కారణంగా జట్టుకు దూరమైన కోహ్లీ రెండవ మ్యాచ్ లో తిరిగి జట్టులోకి వచ్చి తన ప్రభావం చూపలేకపోయాడు. గత కొన్ని రోజులుగా ఫామ్ లేమి తో ఇబ్బంది పడుతున్న విరాట్ తాజాగా జరిగిన వన్డే మ్యాచ్ లో కూడా మళ్ళీ నిరాశపరిచాడు. ఇలా టాప్ ఆర్డర్స్ అంతా కూడా వరుస పెట్టి పెవిలియన్ చేరడంతో టీమిండియా 146 పరుగులకే ఆలౌట్ గా నిలిచింది. దీంతో ప్రత్యర్థి ఇంగ్లాండ్ తో 100 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో ఇరు జట్లు సిరీస్ ను 1-1 తో సమం చేశాయి. ఇక ఆదివారం జరగబోయే మూడవ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మరనుంది.

More Like This

భారత్ కు ” స్పెషల్ విక్టరీ “!

భారత్ కు నిరాశ.. క్లారిటీ ఇచ్చిన రోహిత్ !

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -