Sunday, May 19, 2024
- Advertisement -

ఆ యాంగిల్ పెడితే గాని.. గేమ్ ఆడలేరా..

- Advertisement -

క్రీడలు ఒక్కోసారి జనాల్లోకి అంతగా వెళ్లలేకపోతే నిర్వాహకులు రకరకాల వేషాలు వేస్తుంటారు. వాటిని పబ్లిక్ లోకి తీసుకుపోయి ఆ ఆటలకు క్రేజ్ తేవాలని చూస్తుంటారు. చేసే ప్రయత్నం బాగుంటే అందరూ చ్చుకుంటారు.కాని ఆ ప్రయత్న లోపంతో చేసేది లేక వక్రమార్గాలు తొక్కితే మాత్రం డ్యామేజ్ గట్టిగానే జరిగిపోతుంది. సరిగ్గా అదే డ్యామేజ్ చెస్ కు జరిగింది. చెస్ అంటేనే మేథావుల ఆట.

అలాంటిది ఆ గేమ్ ను ప్రమోట్ చేసే ప్రక్రియలో భాగంగా…చేసిన తప్పిదం నిర్వాహకులను అందరి చేత తిట్లు తినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే…. 2018లో లండన్ వేదికగా ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ టోర్నిలు జరగనున్నాయి. అయితే ఎవరు ఊహించని విధంగా చెస్ గేమ్ కు అవమానం జరిగిందని ప్రముఖులు నెటిజన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చెస్ ఛాంపియన్ షిప్ కోసం ఒక లోగోను వినూత్నంగా డిజైన్ చేయడం వివాదాస్పదమైంది.

కామసూత్ర పోజులో ఉన్న ఇద్దరు వ్యక్తులు చెస్ బోర్డుతో ఉండడం అందరిని షాక్ కి గురి చేసింది. మాస్కోకు చెందిన శుఖ డిజైన్ సంస్థ ఈ తరహా లోగోను డిజైన్ చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కుంటోంది. ఈ లోగోను దాదాపు ఏడాది పాటు ఆలోచించి డిజైన్ చేశారట. అయితే ఇంతకంటే వేరే లోగోనే మీకు దొరకలేదా అని ఇతర చెస్ క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశ్వనాథన్ ఆనంద్ కూడా ఇది మంచి పద్ధతి కాదని చెస్‌ను నైట్ టైమ్ లో చూసే షోగా మార్చేశారని కౌంటర్ వేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -