Sunday, May 19, 2024
- Advertisement -

రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ-టీఆర్ ఎస్ మాట‌ల యుధ్దం

- Advertisement -
bjp vs trs

తెలంగాణా సీఎం కేసీఆర్ మ‌ల్లీ రిజ‌ర్వేష‌న్ల  అంశాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. మైనారిటీల‌కు 12  రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసే విధంగా అన్ని చ‌ర్య‌లు తీసుసుకుంటామ‌న్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించి తీరుతామని, దీనిపై శాసనసభలో చట్టం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని… కేంద్రం సరిగా స్పందించకపోతే యుద్ధం తప్పదని, అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సీఎం కేసీఆర్వ్యా  ప్ర‌క‌టించారు. ఇవి మ‌త‌ప‌ర‌మైన రిజ‌ర్వేష‌న్లు కావ‌ని వ్యాఖ్యానించారు.

ఈవ్యాఖ్య‌ల‌పై బీజేపీ  ధీటుగా స‌మాధాన‌మివ్వ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుధ్దం మొద‌ల‌య్యింది.  అయితే కేసీఆర్ చేసిన వ్యఖ్య‌ల‌పై  బీజేపీ ఎమ్ఎల్ఏ కిష‌న్‌రెడ్డి ఘాటుగా విమ‌ర్శించారు.  కేంద్ర ప్రభుత్వాన్ని కించపర్చేలా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ  తీవ్రస్తాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం తన పరిధులు దాటి మతపరమైన రిజర్వేషన్లను తీసుకొస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీసీలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. ప్రజలను సంఘటితం చేసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చ‌రిచారు.ప్రజలను విభజించి పాలిస్తున్నారంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు. ముందునుంచి బీజేపీ మ‌త రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌త‌రేక‌మ‌న్న‌ది తెలిసందే. ఇక కేంద్రంలో అధికారంలో క‌మ‌లం పార్టీ ఉంది. రిజ‌ర్వేష‌న్ల అంశం కేంద్రంచేతుల్లో ఉంది. మ‌రి సీఎం కేసీఆర్ మైనారిటీల‌కు ఖ‌శ్చితంగా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేస్తామ‌ని క‌రాఖండీగా చెప్పారు.మ‌రి రిజ‌ర్వేష‌న్ల‌పై ఎవ‌రి మాట నెగ్గుతుందో కాల‌మే నిర్ణ‌యించాలి.  

Related

  1. చంద్ర‌బాబు,లోకేష్ ఒక్క‌రోజు తాగే నీరు ఎంత ఖర్చు ఎంతో తెలుసా..?
  2. చంద్రబాబు కు వణుకు పుట్టిస్తున్న ఎన్టీఆర్ జాతకం
  3. జగన్ ప్ర‌శ్న‌ల‌కు జవాబు ఎక్కడ..?
  4. ఇది చదివితే.. జగన్‌కు చేతులెత్తి మొక్కడం ఖాయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -