Sunday, May 19, 2024
- Advertisement -

ముంద‌స్తు ఎన్నిక‌ల‌ని  మ‌రోసారి చేతులు కాల్చుకోవాలా బాబు…..

- Advertisement -
Chandrababu Naidu favouring early elections2019 to Assembly?

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మంచి దూకుడుమీద‌నే ఉండారే చెప్పాలి.   పాల‌న పూర్త‌యిన త‌ర్వాత ఎన్నిక‌ల‌కు వెల్లే చంద్ర‌బాబు ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌ని  చంల‌నాల‌కు తెర‌తీశారు.  ఎన్నిక‌లు ఎప్పుడైనా రావ‌చ్చ‌ని  అందుకు  టీడీపీ శ్రేనులు సిద్దంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

ఇప్పటి నుంచి అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారం షురూ చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసేశారు. ఇంక ఏమాత్రం అలక్ష్యం ఉండరాదని హెచ్చరించారు.ఇక బాబు దూకుడు చూస్తుంటే మెరుగపు బేగంతో ముందస్తు ఎన్నికలకు సన్నద్దం అవుతున్నట్లు పార్టీ శ్రేన‌లు అంటున్నాయి.

వాస్తవానికి చంద్రబాబు సర్కారు పరిపాలన పూర్తయి జూన్ 8 నాటికి మూడేళ్లు పూర్తవుతుంది. ఇంకా రెండు సంవత్సరాల పరిపాలన ఉంది. సాధారణంగా ఏ అధికార పార్టీ అయినా ఏడాది ముందు నుంచి ఎన్నికల సన్నాహాలు చేస్తుంటుంది. మరీ ముందు జాగ్రత్త ఉంటే.. ఏడాదిన్నర నుంచి ఎన్నికల వేడి మొదలవుతుంది. కానీ ఈసారి చంద్రబాబు మాత్రం అప్పుడే ఎన్నికల శంఖారావం పూరించారు. బాబు ముంద‌స్తు ఎన్నిక‌ల  మాట‌ల సంచ‌ల‌నంగా మారాయి. ఎప్పుడూ లేనంత‌గా బాబు ఇంత ప‌క్కాగా చెప్తున్నారంటే దీని వెనుక భారీగానే స్కెచ్ క‌నిపిస్తున్న‌ట్లు స‌మాచారం. 

ఇలా చంద్రబాబు ఎందుకు ముందస్తు జపం చేస్తున్నారు. పార్టీ శ్రేనులు,నాయ‌కుల‌మీద అంత ధీమా ఉందా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి.  కేంద్రంకూడా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరగాలన్న మోడీ వ్యాఖ్య‌లు అందుకు నిద‌ర్శ‌నంగా కనిపిస్తున్నాయి.   ఆ దిశగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఒప్పించి ముందస్తు ఎన్నికల తెచ్చే అవకాశం ఎక్కువ‌గానే ఉంద‌ని రాజ‌కీయ విశ్లేషులు  చెప్తున్నారు.. అందుకోసమే చంద్రబాబు ముందస్తు జపం చేస్తున్నారా.. లేక ప్రస్తుతం ఉన్న మంచి పేరుతో మళ్లీ ఎన్నికల్లో సులభంగా నెగ్గొచ్చని భావిస్తున్నారా …అనేఇ ఎవ‌రికీ అర్థం కావ‌డంలేదు. 

ప్రస్తుతం చంద్రబాబు సర్కారుపై అంత మంచి ఒపీనియన్ కానీ.. మరీ అంత బ్యాడ్ ఒపీనియన్ కానీ లేవు.. పరవాలేదనే మాట వినిపిస్తోంది. కానీ ముందు ముందు ఇంకా గడ్డుకాలమే తప్ప ఈ మాత్రం సానుకూలత కూడా వ్యక్తం కాదని చంద్రబాబు భావిస్తే ముందస్తుకు వెళ్లవచ్చు. కానీ గతంలో 2004లోనూ ఇలాగే ముందస్తుకు వెళ్లి చంద్రబాబు బొక్కబోర్లా పడ్డారు. అప్పుడు అలిపిరి దాడి తర్వాత వెల్లువెత్తిన సానుభూతిని ఓట్ల రూపంలో మార్చుకుందామని ఆశించిన ఆయనకు భంగపాటు తప్పలేదు. 

 చంద్ర‌బాబు మాట‌లు చూస్తే అలానే ఉన్నాయి. రాష్ట్రంలో టీడీపీ ఓటుశాతం పెరిగింద‌ని…  వైసీపీలో ఓటు శాతం త‌గ్గింద‌ని బాబు వ్యాఖ్యానించారు. వాస్త‌వంగా చూసుకుంటే ప్ర‌జ‌ల్లో టీడీపీ పాల‌న మీద ప్ర‌జా వ్య‌తిరేక‌త రోజు రోజుకీ పెరిగిపోతోంది. బాబు చేసుకున్న సొంత స‌ర్వేల‌లో కూడా పాల‌న‌మీద ప్ర‌జ‌లు సంతృప్తిగా లేర‌నే  రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి ఏధైర్యంతో ముంద‌స్తు ఎన్నిక‌లు అంటున్నారో అర్థం కావ‌డంలేద‌ని టీడీపీ నాయ‌కులే అంటున్నారు.

తాజాగా కేంద్ర – రాష్ట్ర మంత్రులకును పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీ – పార్టీ బాధ్యతల పర్యవేక్షణకు నియమించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. బాబు దూకుడు చూస్తుంటే మెరుగపు వేగంతో ముందస్తు ఎన్నికలకు సన్నద్దం అవుతున్నట్లు చెప్తున్నారు. కాగా కీలకమైన విజయవాడ బాధ్యతలు యువనేత నారా లోకేష్ కు అప్పగించడం గమనార్హం. 

బాధ్యతలు అప్పగించిన మంత్రుల  వివరాలు ఇలా ఉన్నాయి….

పార్లమెంటు నియోజకవర్గం  ఇంచార్జ్ మంత్రి

1. శ్రీకాకుళం పితాని సత్యనారాయణ

2. విజయనగరం గంటా శ్రీనివాసరావు

3. విశాఖపట్నం నిమ్మకాయల చినరాజప్ప

4. అనకాపల్లి పి. అశోకగజపతిరాజు

5. అరకు (ఎస్టీ)  నక్కా ఆనందబాబు

6. కాకినాడ కిమిడి కళా వెంకట్రావు

8. రాజమండ్రి కేఈ కృష్ణమూర్తి

9. నరసాపురం కొల్లు రవీంద్ర

10. ఏలూరు ప్రత్తిపాటి పల్లారావు

11. విజయవాడ నారా లోకేష్

12 మచిలీపట్నం యనమల రామకృష్ణుడు 

13. గుంటూరు సి.హెచ్ అయ్యనపాత్రుడు 

14 నరసరావుపేట  శిద్దా రాఘవరావు

15 బాపట్ల (ఎస్సీ)  పరిటా సునీత

16. ఒంగోలు పి.నారాయణ

17.నెల్లూరు అమరర్నాథ్ రెడ్డి

18. తిరుపతి (ఎస్పీ)  భూమా అఖిలప్రియ

19. చిత్తూరు  (ఎస్పీ) కింజారపు అచ్చెన్నాయుడు

20. రాజంపేట ఆదినారాయణరెడ్డి

21. కడప సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి

22. నంద్యాల కాలువ శ్రీనివాసులు

23. కర్నూలు  సుజనా చౌదరి

24.అనంతపురం దేవినేని ఉమామహేశ్వర రావు

25.హిందూపూర్  కేఎస్ జవహర్

బాబు ధీమా చూస్తుంటే 2018లోనే ఎన్నిల‌కు వెల్లేట్టు ప‌రిస్థితులు క‌నిప‌స్తున్నాయి. మ‌రి 2014 మాదిరి ముంద‌స్తు ఎన్నిక‌ల‌ని చేతులు కాల్చుకుంటారా లేకా అధికారంలోకి వ‌స్తారా అనేది వేచే చూడాలి. ఏదైనా బాబు కాన్ఫిడెన్స్‌న మెచ్చుకోవాల్సిందే.

Also Read

  1. కాన్ఫిడెన్సా …. ఓవ‌ర్ కాన్ఫిడెన్సా
  2. నంద్యాల ఎన్నిక సెంటీమెంట్ అస్త్రం టీడీపీకీ ఫ‌లిస్తుందా..?
  3. సోషల్ మీడియాలో వైసీపీ సరికొత్త విప్లవం..
  4. జ‌గ‌న్‌పై లోకేష్ పోటీచేస్తారు బుద్ధా వెంక‌న్న స‌వాల్‌

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -