Monday, April 29, 2024
- Advertisement -

సోషల్ మీడియాలో వైసీపీ సరికొత్త విప్లవం..

- Advertisement -
Jagan Legal Advice Panel

సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తే ఊరుకోం.. అనే రీతిలో వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వ ముఖ్యులు.. లాస్ట్ కి అనుకున్నంత పని చేశారు. ఫేస్ బుక్ లో ఒక సెటైరిక్ పేజ్ ను నడుపుతున్న రవికిరణ్ ఇంటూరిని తాజాగా తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. పొలిటిక‌ల్ పంచ్ అనే పేజ్‌తో అధికార తెలుగుదేశం పార్టీ ప‌నితీరుని,చంద్ర‌బాబు, లోకేష్‌ల అరాచ‌కాల్ని బ‌య‌ట‌పెడుతూ టీడీపీని దిగ‌జార్చే విధంగా పోస్టులు పెడుతున్నార‌ని ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబుపై తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డానికి పొలిటిక‌ల్ పంచ్ కార‌ణం అవుతోంద‌ని గ్ర‌హించి అసెంబ్లీ పోస్టును కార‌ణంగా చూపి తెల్ల‌వారుజామున మూడు గంట‌ల‌కు ర‌వి కిర‌ణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో ఇక త‌మ‌పై కార్టూన్ ప్ర‌చారం జ‌ర‌గ‌ద‌ని భావించిన టీడీపీ కి మ‌రో రెండు పేజీలు పుట్టుకువ‌చ్చి దాని క‌న్నా రంజుగా ప్ర‌చారం మొద‌లుపెట్టాయి. ఇక వైసీపీ అభిమానుల‌కు మ‌నోధైర్యం కోల్పోకుండా వారికి అండ‌గా ఉండేందుకు వైసీపీ సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. దీనిపై లోట‌స్ పాండ్ వేదిక‌గా నేత‌లు నాయ‌కుల‌తో వైసీపీ సీనియ‌ర్ నేత‌లు చ‌ర్చిస్తున్నార‌ట‌. దీనిపై జ‌గ‌న్‌కు స‌ల‌హాలు ఇచ్చే నాయ‌కుడు రాజ్య‌స‌భ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి ఓ స‌ల‌హా ఇచ్చారట‌.  

సోష‌ల్ మీడియాకు వైసీపీ ఆయువుప‌ట్టు.. దాన్ని గ్ర‌హించిన టీడీపీ ఇలా అణ‌గ‌దొక్క‌డానికి చూస్తున్నారు కాబట్టి మ‌నం వారంద‌రికి స‌హ‌క‌రించేలా లీగ‌ల్ అడ్వైజ‌రీ పానెల్ ఏర్పాటు చేద్దామ‌ని జ‌గ‌న్ కు స‌ల‌హా ఇచ్చార‌ట‌. జ‌గ‌న్‌కు అనుకూలంగా సోష‌ల్ మీడియాలో ప‌నిచేసే సైట్లు గ్రూపుల‌కు పేజీల‌కు ఈ లీగ‌ల్ అడ్వైజ‌రీ ప్యానెల్ స‌ల‌హా ఇస్తుంద‌ట‌.. రాజ్యాంగ పరంగా ఎదుర‌య్యే చిక్కులు ప‌లు విష‌యాల‌పై ఈ ప్యానెల్‌ని అప్రోచ్ అయ్యేలా ఉచిత స‌ల‌హా సూచ‌న‌లు తీసుకునేలా ఏర్పాటు చేయాల‌ని ఆలోచిస్తున్నార‌ట‌.. ఇందుకు జ‌గ‌న్ సుముఖుత వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. నిజ‌మే భ‌జ‌న ఛాన‌ళ్ళ‌ను కొన్న‌ట్లు సోష‌ల్ మీడియాను కొన‌లేరు. అందుకే అమాయ‌క ప్ర‌జ‌ల‌పై ఇలా కేసుల‌తో నిలువ‌రించాల‌ని చూస్తున్నారు..స‌ర్కార్‌. అంతే మ‌రి సోష‌ల్ మీడియాని క‌నిపెట్టిన చంద్రం సారుకి అదే సోష‌ల్ మీడియా కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని ప్రజ‌లు భావిస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. లోకేష్‌తో టీడీపీ సంక‌నాక‌డం ఖాయం…..అయేమ‌యంలో చంద్ర‌బాబు
  2. నేరం రుజువైతే 5 సంవ‌త్స‌రాలు జైలు శిక్ష‌
  3. ఈనెల 28కి తీర్పును రిజ‌ర్వ్ చేసిన సీబీఐ కోర్టు
  4. జ‌గ‌న్‌పై లోకేష్ పోటీచేస్తారు బుద్ధా వెంక‌న్న స‌వాల్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -