Saturday, June 1, 2024
- Advertisement -

ఉద్యోగుల‌కు 9నెల‌ల జీతంను ఆప‌ర్ చేస్తున్న సంస్థ‌

- Advertisement -
Cognizant top execs get voluntary separation option will get 9 months

దేశంలో ఉన్న టాప్ సాప్ట్‌వేర్ కంపెనీల‌న్ని ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకొనేదానిలో భాగంగా త‌మ ఉద్యోగుల‌ను తొల‌గించ‌డానికి శ్రీకారం చుట్టాయి.అన్నీ కంపెనీలు ఇప్పుడు అదేబాట‌లో న‌డుస్తున్నాయి. ప్రముఖ సంస్థ కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఈ ఏడాది ఉన్నత స్థాయి ఉద్యోగులపై వేటు వేయనుంది. డిజిటల్‌ టెక్నాలజీ వైపు మళ్లుతున్న నేపథ్యంలో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత మంది ఉద్యోగులను తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశం డిజిట‌ల్ వైపు వెల్లాల‌ని పిలుపు నివ్వ‌డంతో డిజిటల్‌ పద్ధతుల్లోకి మారేందుకు, నాణ్యత, సుస్థిరాభివృద్ధి సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ మీద ప‌డుతున్న భారం త‌గ్గించుకొనేదానికే ఈచ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని కంపెనీ చెప్తోంది. ఇందుకోసం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకు పరిహారం చెల్లించనుంది. కంపెనీలో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తోంది. అసోసియేట్‌ డైరెక్టర్‌ స్థాయి నుంచి బోర్డు మెంబర్లు, వైస్‌ ప్రెసిడెంట్లు ఇందులో ఉన్నట్లు సమాచారం.

వారికి ర్యాంకు ఆధారంగా పరిహారం చెల్లించనున్నారు. పరిహారం కూడా కనీసం 9 నెలల జీతం ఉండేట్లుగా సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం గత మూడు నెలలుగా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కనీసం రూ.40లక్షలను వేతనంగా అందుకుంటున్న వారు ‘స్వచ్ఛంద ఉద్యోగ విరమణ’ కిందకు రానున్నారు.మరోవైపు ఉద్యోగాల నియమాక ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని, ప్రపంచవ్యాప్తంగా సౌకర్యాలు మరింత మెరుగుపరుస్తామని కంపెనీ పేర్కొంది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికల్లా పూర్తి చేయాలని కంపెనీ భావిస్తోంది.

Related

    1. త్వ‌ర‌లో స్టూడెంట్ ఎడిష‌న్ ల్యాప్‌ట్యాప్‌లు అందుబాటులోకి రానున్నాయి…
    2. 1500 వంద‌ల‌కే స్మార్ట్ పోన్‌…
    3. రిలయన్స్ మరో సూపర్ ఆఫర్.. 148 కి 70 జీబీ
    4. ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ భారీ షాక్‌…

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -