Saturday, April 20, 2024
- Advertisement -

గ్రీన్ కార్డుకోసం ఎదురుచూస్తున్న భార‌త టెక్కీల‌కు షాక్ ఇచ్చిన కాగ్నిజెంట్

- Advertisement -
Cognizant makes it difficult for Indian employees to get green cards

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాలోని స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశ్యంతో హైర్ అమెరికన్, బై అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తీసుకొచ్చాడు ట్రంప్. అమెరికన్లకే ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

దీనిలో భాగంగానే భార‌త టెక్కీల‌కు మ‌రో సారి భారీ షాక్ ఇచ్చింది కాగ్నిజెంట్‌.అమెరికా బహుళ జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యుషన్స్ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఉద్యోగులపై నీల్లు చ‌ల్లింది. ఈబీ2, ఈబీ3 మార్గాల్లో గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తులను నింపడం లేదని కాగ్నిజెంట్ స్పష్టంచేసింది.ఈ రెండు కేటగిరీల్లో ప్రస్తుత దరఖాస్తుదారులకు మాత్రమే మద్దతు ఇస్తామని, కొత్త వాటిని సస్పెండ్ చేస్తామని పేర్కొంది. స్థానిక ఉద్యోగులను పెంచే ఉద్దేశ్యంతోనే కాగ్నిజెంట్ ఈ ప్రక్రియను నిలిపివేస్తుందని టెక్ విశ్లేషకులంటున్నారు. దీంతో భారతీయ ఉద్యోగులు గ్రీన్ కార్డులు పొందడం కష్టతరమేనని పేర్కొంటున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

అసోసియేట్లకు శాశ్వత నివాసం కల్పించేందుకు ఓ ముఖ్యమైన స్పాన్పర్ గా ఉంటామని కాగ్నిజెంట్ ప్రకటించింది. భవిష్యత్ లో కూడ ఇదే కొనాసగుతోందని ప్రకటించింది.అయితే కాగ్నిజెంట్ ఈబీ2, ఈబీ3 అప్లికేషన్స్ ప్రక్రియను నిలిపివేయడం శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న హెచ్-1బీ వీసా హోల్డర్స్ కు భారీ షాకేనని తెలుస్తోంది.అసాధారణమైన ప్రతిభ కనబర్చే సీనియర్ మేనేజ్ మెంట్ లేదా ప్రొఫిషినల్స్ కు గ్రీన్ కార్డు కోసం ఈబీ1 రూట్ వాడతారు. ఈబీ2, 3 వీసాలను ప్రతిభావంతులైన వర్కర్లు, ప్రొఫిషనల్స్ కు, మధ్య, దిగువ స్థాయి ఉద్యోగులకు వాడతారని డేవిస్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్టనర్ మార్క్ డేవిస్ తెలిపారు.

{loadmodule mod_custom,Side Ad 2}

కాగ్నిజెంట్ హెచ్ 1 బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించనున్నట్టు ఇటీవలనే ప్రకటించింది. గత ఏడాది కంటే సగానికి తక్కువగా ఈ ఏడాది వీసాలను అప్లయ్ చేసింది. అమెరికా డెలీవరి సెంటర్లలో ఈ ఐటీ సంస్థ స్థానిక నియామకాలను పెంచింది.అంతేకాదు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేందుకు ఆ కంపెనీ రంగం సిద్దం చేసింది.ఇప్పటికే కొంతమంది ఉద్యోగులకు నోటీసులు కూడ జారీ చేసింది. అయితే కొందరు నేతలు ఈ విషయమై కార్మిక శాఖను కూడ ఆశ్రయించారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -