Tuesday, May 7, 2024
- Advertisement -

 వైసీపీ …టీడీపీ మ‌ధ్య సోషియ‌ల్ వార్

- Advertisement -
Social Media War Between YSRCP and TDP

వైసీపీ ….టీడీపీ మ‌ధ్య   సోషియ‌ల్ మీడియా  మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే దీనిమీద పెద్ద దుమారం రేగుతుండ‌గా ఇప్పుడ‌ది తారాస్థాయికి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసు వ్య‌వ‌స్త ద్వారా చ‌ర్య‌లు తీసుకుంటున్న ప్ర‌భుత్వ ….త‌న స్వ‌రంలో మార్పు పెంచింది.

టీడీపీ పార్టీ నాయ‌కులు ఎదురుదాడి ప్రారంభించారు.  మాటల యుద్ధం చాల‌వ‌న్న‌ట్లు కుంటుంబ విష‌యిల‌ను కూడా సోషియ‌ల్ మీడియా వార్‌లోకి లాగ‌డంపై అధికార  ప‌క్షంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి.

సోషియ‌ల్ మీడియాలో లోకేష్‌ను కించ‌ప‌రుస్తూ కామెంట్స్‌ను పెట్టిన ర‌వికిర‌ణ్‌ను పోలీసువ్య‌వ‌స్త‌ద్వారా  అరెస్ట్ చేయించింది.దీనిపై సోషియ‌ల్ మీడియాలో ప్ర‌భుత్వంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో అత‌న్ని   పోలీసులు వ‌దిలిపెట్టారుఎ. ర‌వి కిర‌ణ్‌కు మ‌ద్త‌తుగా వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడ‌టంపై …… టీడీపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి వైసీపీపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.ఏకంగా జ‌గ‌న్ కుంటుంబ విష‌యాల‌ను సోషియ్ వార్‌లోకి లాగారు. గతంలో వైసిపి అధినేత షర్మిల పైన సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయలేదా అని టిడిపి నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం నాడు ప్రశ్నించారు. మీరు ఫిర్యాదు చేస్తే తప్పు లేదు కానీ మేం చేస్తే తప్పా అని ప్రశ్నించారు.

ఇక వైసీపీ కూడా అంతే స్థాయిలో ఐటీ,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లోకేష్ తీరుపై  వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.జయంతికి.. వర్థంతికి తేడా తెలియదని.. పంచాయితీ రాజ్ మంత్రిగా తాగునీటి సమస్యను సృష్టించటమే లక్ష్యమంటారా? అని ప్రశ్నించిన ఆమె.. రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయో కూడా తెలియకుండా వచ్చే ఎన్నికల్లో 200 సీట్లలో గెలిపించాలలని వ్యాఖ్యానించటం ఏమిటని మండిపడ్డారు. ఇలా మాట్లాడే వ్యక్తిని పప్పు అనకుండా ఇంకేం అనాలి? గూగుల్ లో పప్పు అని టైప్ చేసి సెర్చ్ చేస్తే.. పప్పు దినుసులతో పాటు నారా లోకేశ్ ఫోటోలు వస్తున్నాయి. దద్దమ్మ మంత్రిని ప్రజలపై బలవంతంగా చంద్రబాబు రుద్దుతున్నారు” అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదంతా కూడా లోకేష్ పుణ్య‌మాని మొద‌లైంది. రాజ‌కీయాలల్లో ఎటువంటి అనుభ‌వం లేకుండా ఏకంగా మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌డితే ఇలా నే ఉంటుంది. ఎమ్మెల్సీగా  త‌ప్పుగా ప్ర‌మాన స్వీకారం చేయ‌డం, జ‌యంతికి  వ‌ర్థంత‌కి తేడాతెలియ‌కుండా మాట్లాడ‌టం,200 సీట్ల‌లో గెల‌వాల‌ని మ‌తిలేకుండా త‌ప్పుమీద త‌ప్పుచేస్తూ ప్ర‌తిప‌క్షాల‌కు అయుధంగా మారుతున్నారు. లోకేష్ ను ఇప్ప‌టికే సోషియ‌ల్ మీడియా ఏరేంజ్‌లో ఏకేసిందో అంద‌రికీ తెలిసింది. పార్టీల మ‌ధ్య చూసుకోవ‌లిగాని కుంటుంబ‌విష‌యాల‌ను దీనిలోకి లాగ‌డం ఏంట‌ని టీడీపీని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు.

Also Read

  1. నెటి జ‌న్ల‌కు జ‌గ‌న్ పిలుపు….. నేను అండ‌గా ఉంటా..
  2. రవికిరణ్ ను అరెస్ట్ చేసారు సరే.. మరి వీళ్ల సంగతి ఏంటి బాబులు..?
  3. సోషల్ మీడియాలో వైసీపీ సరికొత్త విప్లవం..
  4. అబద్దపు కథనాలు ప్రసారం పై ABNకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రవికిరణ్

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -