Sunday, May 19, 2024
- Advertisement -

పాక్ ప్ర‌ధాని న‌వాజ్‌పై కేసు న‌మోదు….

- Advertisement -
Police register report against Nawaz Sharif for ‘anti-army’ speech

దాయాది దేశం పాకిస్థాన్‌లో పేరుకే ప్ర‌జాస్వామ్యం. పెత్త‌న మంతా ఆర్మీదేన‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం. ప్ర‌ధాని న‌వాజ్‌ష‌రీప్ మాట‌కంటె ఆర్మీ మాటకే అక్క‌డి ప్ర‌జ‌లు ఎక్కు విలువ నిస్తారు.ఆర్మీని కాద‌ని ఏనిర్ణ‌యం తీసుకున్నా అది బూడిద‌లో ప‌న్నీరు లాగా త‌యార‌వుతుంది.ఏ దేశంలోనైనా అధ్య‌క్షుడు,ప్ర‌ధానికి విలువ ఎక్కువ కానీ పాకిస్తాన్‌లో మాత్రం జీరోనే. ఇప్పుడు ఏకంగా ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీప్ పైనే కేసు న‌మోద‌య్యింది. విన‌డానికి వింత‌గానే ఉన్నా ఇది నిజం.

ప్రజలను రెచ్చగొట్టి, సైన్యంపై ద్వేషభావాన్ని కలిగించినందుకు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. రావల్పిండిలోని సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్‌లో ఇష్తియాక్ అహ్మద్ మీర్జా అనే న్యాయవాది ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఆయన తనను తాను ఐఎం పాకిస్తాన్ పార్టీ చైర్మన్‌గా పేర్కొన్నారు. అయితే, ప్రధాని మీద నమోదు చేసింది ఎఫ్ఐఆర్ కాదని, స్థానికంగా దాన్ని ‘రోజ్‌నామ్చా’ అంటారని పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రిక తెలిపింది.

తనకు వాట్సప్‌లో ఒక వీడియో క్లిప్ వచ్చందని, అందులో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మాట్లాడుతున్నట్లు ఉందని మీర్జా చెప్పారు. ఆయన ప్రజలను రెచ్చగొడుతూ, పైనిక దళాల మీద విద్వేషాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు. పీఎంఎల్ ఎన్ పార్టీ అధ్యక్షుడైన నవాజ్ షరీఫ్ మీద కేసు కూడా నమోదుచేయాలని ఆయన కోరారు. తమ పార్టీ పాకిస్తాన్ ఎన్నికల కమిషన్‌లో కూడా రిజిస్టర్ అయిందని చెప్పారు. పాకిస్తాన్ సైన్యం అక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. మొత్తం 70 ఏళ్ల పాక్ చరిత్రలో 33 ఏళ్లు సైనికపాలనే గడిచింది.

దీన్ని బ‌ట్టి చూస్తె అర్థ మ‌వుతుంది పాకిస్తాన్‌లో ఎలాంటి పాల‌న ఉందో అర్థం అవుతుంది. ఏకంగా ప్ర‌ధాని మీదే కేసు న‌మోదు చేశారంటె న‌వాజ్ ఎంత డ‌మ్మీనో తెలిసి పోతుంది. అందుకే అక్క‌డ ప్ర‌ధాని మాట‌కంటె ఆర్మీమాటె చెల్లు బాటు అవుతుంది.

Related

  1. నా పెళ్లి..పాస్ చేయండి సార్‌…
  2. చంద్రబాబుకు ఊహించని షాక్.. వైసీపీలో కి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే
  3. ప్రభుత్వ ఎల్పీజీ సంస్థలు ప్రభుత్వం ఒప్పుకుంటే త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
  4. మహిళా ఎమ్మెల్సీలకు ఆ వీడియోలు పంపిన బీజేపీ ఎమ్మెల్సీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -