- Advertisement -

బాబు ఎపిసోడ్.. వెనుక ఉంది వారిద్దరేనా?

- Advertisement -

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఏపీ సీఐడీ న్యాయస్ధానం మాజీ సీఎం చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో బాబును రాజమండ్రి జైలుకు తరలించగా అసలు చంద్రబాబు జైలు పాలవుతారని ఎవ్వరూ ఊహించలేదు. ఎందుకంటే బాబు రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే ఎన్నో ఆరోపణలు వచ్చినా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని బయటికొచ్చారు. కానీ ఈసారి పూర్తిగా డిఫరెంట్.

చంద్రబాబు బీజేపీతో మైత్రీ కోసం ఢిల్లీ వెళ్లడం, తర్వాత పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వెంటనే బాబుకు ఐటీ నోటీసులు రావడంతో అంతా షాక్‌. కానీ పొలిటికల్ వర్గాల సమాచారం ప్రకారం బాబు అరెస్ట్ వెనుక పక్కా స్కెచ్, బీజేపీ నేతల ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అవినీతికి సంబంధించిన చిట్టా మొత్తాన్ని మోడీ & అమిత్ షాకు అందించారట జగన్. ఇదే విషయమై తరచూ ఈ ఇద్దరు నేతలతో చర్చించారట.

దీంతో చంద్రబాబు జైలు పాలు కావడం వెనుక బీజేపీ అగ్రనేతల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబుకు మద్దతుగా నిలిచినప్పటికి బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం స్పందించలేదు. దీంతో బాబు అరెస్ట్ వెనుక కేంద్రం హస్తం ఉందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇక టీడీపీ …బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నా బీజేపీ నేతలు పట్టించుకోలేదని, ఈ పరిణామాలు బీజేపీకి ముందుగానే తెలిసినందునే బాబును పట్టించుకోలేదని వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో మున్ముందు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -