- Advertisement -

ములాఖత్‌లో మిలాఖత్ అయ్యారు!

- Advertisement -

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించారు ఏపీ సీఎం జగన్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వైఎస్సార్‌ కాపు నేస్తం నిధులు విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు అరెస్ట్‌తో పాటు టీడీపీ – జనసేన పొత్తుపై విమర్శలు గుప్పించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రధాన ముద్దాయి చంద్రబాబేనని మొదటి నుండి తాము ఇదే చెబుతున్నామన్నారు.సీఐడీ అధికారుల విచారణలో ఇదే తేలిందని…చంద్రబాబే కుట్రదారు అని సాక్ష్యాధారాలతో సహా ఛార్జీషీట్‌లో పేర్కొన్నారన్నారు.

చంద్రబాబు ఎన్నో మోసాలకు పాల్పడ్డారు…ఆయన పలుకుబడి ఇన్నాళ్లు ఆయన వెనుక ఉన్న ముఠా కాపాడింది కానీ ఇప్పుడు ఆ ప్రయత్నాలు సాగలేదన్నారు. చట్టం ఎవరికైనా సమానమేనని…తప్పు చేసిన అడ్డంగా దొరికిపోయినా ఆయన్ని కొంతమంది కాపాడే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలన్నారు. పనిలో పనిగా పవన్‌పై కూడా విమర్శలు గుప్పించారు జగన్.

చంద్రబాబు అరెస్టయినా.. ప్రశ్నిస్తానన్న వ్యక్తి ప్రశ్నించడంటూ పవన్ పై మర్శలు గుప్పించారు. అవినీతి పరుడికే మద్దతివ్వడం, వెన్నుపోటు దారుడి వెంట నడవడం రాజకీయమా అన్నారు. జైలు ములాఖత్లో ఎలా మిలాఖత్ అయ్యారో ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు జగన్.

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి ఆరు రోజులు గడుస్తోంది. ఇప్పటివరకు వైసీపీ మంత్రులే విమర్శలు చేస్తూ వస్తుండగా తాజాగా జగన్‌ రంగంలోకి దిగడంతో ఆ పార్టీ నేతలు విమర్శల దాడిని మరింత పెంచే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -