- Advertisement -

పవన్‌పై బీజేపీది అత్యాశేనా!

- Advertisement -

తెలంగాణ ఎన్నికల పోటీ నుండి టీడీపీ తప్పుకోగా బీజేపీ మాత్రం జనసేనతో కలిసి ఎన్నికల రణరంగంలోకి దిగనుంది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న బీజేపీ నేతలు పవన్‌పై పెట్టుకున్న ఆశలు చూస్తే మాత్రం అతి చేస్తున్నారనే అనిపించక మానదు. ఎందుకంటే తెలంగాణలో పవన్ చూపే ప్రభావం ఎంతో తెలియదు కానీ ఆయనో పెద్ద నేతగా ప్రొజెక్టు చేస్తున్నారు కాషాయ నేతలు.

వాస్తవానికి తెలంగాణ ఎన్నికల్లో 32 స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించారు పవన్. తర్వాత జనసేతో మైత్రి బంధానికి బీజేపీ తెరలేపింది. అయితే అంతో ఇంతో జనసేన బలంగా ఉంది ఏపీలో మాత్రమే. కానీ అక్కడ బీజేపీ నేతలు జనసేనతో పొత్తుకు వెంపర్లాడకపోయినా తెలంగాణలో అంతగా పట్టులేని పవన్ కోసం మాత్రం వెతుక్కుంటూ వచ్చి జత కలిశారు. ఇప్పుడు ఇదే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఇక ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా తెలంగాణలో జనసేన ప్రభావం సున్న. పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ తప్ప జనసేనకు క్షేత్ర స్థాయిలో బలం లేదు. ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. కానీ బీజేపీకి అంతో ఇంతో బలం ఉంది. అలాంటి బీజేపీ…జనసేనతో పొత్తుకు వెంపర్లాడమెంటో ఇదేం పొలిటికల్ స్ట్రాటజీనో ఆ పార్టీకే తెలియాలి. దీనికి తోడు తెలంగాణలో జనసేనతో పొత్తుకు ఏకంగా అమిత్ షా లెవల్లో లాబీయింగ్ నడిపారు. అయితే ఒక్క పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ తప్ప జనసేనతో బీజేపీకి వచ్చే అడ్వాంటేజ్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఇక పవన్‌తో పొత్తుకు కాషాయ నేతలు వెంపర్లాడటంపై ఆ పార్టీ నేతలే చురకలు అంటిస్తున్నారు. ఏపీలో రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్‌…తెలంగాణలో ఏ విధంగా ప్రభావం చూపగలడని ఎద్దేవా చేసిన పరిస్థితి నెలకొంది. మరి పవన్‌పై బీజేపీ నేతలు పెట్టుకున్న ఆశలు అత్యాశే అవుతుందా అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -