సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో జనసేన తరపున విశాఖపట్నం నుండి పోటీ చేసిన జేడీ…మూడో స్థానంలో నిలిచారు. తర్వాత జనసేనకు రాజీనామా చేసి వ్యక్తిగతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఆయన త్వరలోనే వైసీపీ లేదా టీడీపీ చేరుతారని ప్రచారం జరుగుతుండగా పోటీతో పాటు పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం నుండే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అలాగే ఏ పార్టీలో చేరనని అవసరమైతే కొత్త పార్టీ పెట్టి పోటీ చేస్తానని తెలిపారు.
ఇక ఏపీలో బోగస్ ఓట్ల తొలగింపుపై టీడీపీ చేస్తున్న రాద్దాంపై స్పందించిన జేడీ…బోగస్ ఓట్లను ఏరివేయాలని ఇందుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.అలాగే నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్న జాబ్ మేళాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. డిసెంబర్ 2వ తేదీన విశాఖపట్నంలో జేడీ ఫౌండేషన్, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని జేడీ ప్రకటించడంతో ఆయన అభిమానుల్లో జోష్ నెలకొంది.
