ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ దూకుడు మీదుంది. ఇప్పటికే జగన్ సిద్ధం పేరుతో వైసీపీ కేడర్‌తో పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహిస్తుండగా పార్టీ కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఇక ఇదే సమయంలో రా కదలి రా అంటూ టీడీపీ నిర్వహిస్తున్న సభలు వెలవెలబోతున్నాయి.
చంద్రబాబు పాల్గొన్న పీలేరు, ఉరవకొండ సభలు ప్రజలు లేక వెలవెలబోయాయి. ముఖ్యంగా పీలేరులో చంద్రబాబు సభపై ఆసక్తి చూపలేదు జనాలు. దీంతో పరువు పోతుందని పక్క నియెజకవర్గాల నుండి ఏసీ బస్సుల్లోఏసీ బస్సులు, ఇతర వాహనాల్లో ప్రజలను తరలించారు. రోజువారి కూలీ ఇచ్చి తీసుకొచ్చినా చంద్రబాబు ప్రసంగిస్తుండగానే జనాలు మధ్యలో నుండే వెళ్లిపోయారు. ఇక నెల్లూరు , పత్తికొండలో జరిగిన టీడీపీ సభల సంగతి చెప్పనక్కర్లేదు. జనాలు లేక సభలు వెలవెలబోయాయి. ఇక రోటిన్‌గా చంద్రబాబు ప్రసంగం ఉండటంతో టీడపీ నేతలు సైతం ఇబ్బంది పడిన సందర్భం నెలకొంది.
ఇక టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే జగన్ భీమిలి సభకు కార్యకర్తలు పోటెత్తారు. సముద్రాన్ని తలపించేలా, ఇసుక పోస్తే రాలని విధంగా తరలివచ్చారు కార్యకర్తలు. ఇందులో ఎక్కువ మంది యువతే ఉండటం విశేషం. ఇక జగన్ ప్రసంగానికి అంతా ఫిదా కాగా చంద్రబాబు, పవన్‌పై సెటైర్లు వేస్తున్నప్పుడు మంచి స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు టీడీపీ నేతలే బాబు సభలకు జనాలు కావలెను అనే విధంగా ప్రచారం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక స్వయంగా చంద్రబాబే హాజరవుతున్న ప్రజల నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో టీడీపీ నేతలు సైతం నిరాశకు గురవుతున్నారు.
