- Advertisement -

క్రీడాకారులకు అండగా ఆడుదాం ఆంధ్ర

- Advertisement -

తాము చేపట్టే ప్రతి పనినీ కేవలం రాజకీయంగా లబ్ధిపొందే లక్ష్యంతో చేపట్టే నాయకులు ఉన్న కాలం ఇది… కానీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రతి పని, ప్రతి కార్యక్రమంలోనూ సామాజిక ప్రయోజనం ఉంటుంది… తరచి చూస్తే అయన అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అంతిమంగా సామాజిక ప్రయోజనాన్ని ఉద్దేశించినది అయి ఉంటుంది.

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర మీద ఆడిపోసుకున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఆ కార్యక్రమం అంతరార్థం అర్థం కాలేదు.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వెనువెంటనే గొప్ప ఫలితాలు సాధించింది.

విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన పవన్ లోని క్రీడా స్ఫూర్తి, నైపుణ్యాలను గుర్తించిన చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ యాజమాన్యం ఆ కుర్రాడిని తమ టీములో చేర్చుకునేందుకు ముందుకు వచ్చింది.

త్వరలో జరిగే ఐపీఎల్ టోర్నమెంటుకు సంబంధించి సన్నాహాలు జరుగుతుండగా ఇప్పుడు పవన్ ను సైతం తమ టీములో చేర్చుకుంటాం అని CSK పేర్కొంది.ఆయన్ను చెన్నై తీసుకెళ్లి మంచి శిక్షకులతో ట్రైనింగ్ ఇప్పించి మున్ముందు ఆయన్ను తమ జట్టులోకి తీసుకుంటాం అని చెప్పింది.నిరుపేద అయినా పవన్ కు ఇది ఒక గొప్ప అవకాశం అని… మున్ముందు అయన ఉన్నత స్థానానికి చేరుకుంటాడు అని అయన మిత్రులు ఆశిస్తున్నారు.

కేవలం ఆడుదాం ఆంధ్రాలో పాల్గొని సత్తా చూపడంతో తనకు ఈ అవకాశం వచ్చిందని పవన్ అంటున్నారు. తనలాంటి గ్రామీణ క్రీడాకారులకు ఈ క్రీడా పోటీలు ఎంతో ఉత్సాహాన్ని.. ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని అయన అన్నారు.తెలుగుదేశం వాళ్ళు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని.. యువతను, క్రీడాకారులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలను ఆహ్వానించి … అభినందించాలని క్రీడా ప్రేమికులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -