- Advertisement -

అలాంటి వెధవ పనులు చేయను:రేవంత్

- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఎన్నికల కోడ్ నేపథ్యంలో సమీక్ష జరపలేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన రేవంత్… ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చాం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ జరపడం లేదని..అలాంటి వెధవ పనులు చేయనని తేల్చిచెప్పారు. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు.. ఫోన్ ట్యాపింగ్ పై ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పనపై జరుగుతున్న వివాదంపై స్పందించారు రేవంత్. తెలంగాణ పోరాటాలు, చిహ్నాలు, తెలంగాణ తల్లి, తెలంగాణ గీతం స్పురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలు అందె శ్రీకి ఇచ్చాం..ఆయనే కీరవాణిని ఎంపిక చేశారన్నారు. తెలంగాణ చిహ్న రూపకల్పన నిజామాబాద్ వ్యక్తికి ఇచ్చామని అన్నారు.

కాళేశ్వరం సమస్య 32పళ్లలో ఒక పన్ను విరిగితే వచ్చే సమస్య కాదు. విరిగింది వెన్నుముక అని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని స్టోర్ చేసే పరిస్థితి లేదని, 52 టీఎంసీల నీరు సముద్రం పాలయ్యాయయని తెలిపారు. సముద్రంలోకి వెళ్లిన నీటికి కరెంట్ బిల్లులు కట్టామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -