- Advertisement -

రావ‌ణుడిగా సీఎం విజయ్.. అమ్మవారిగా త్రిష..!

- Advertisement -

తమిళనాడులోని సేలం జిల్లా ఆత్తూర్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆషాఢ మాసం సందర్భంగా స్థానిక మారియమ్మన్ ఆలయంలో వార్షిక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల సందర్భంగా కొందరు స్థానిక యువకులు ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ బ్యానర్ తీవ్ర వివాదానికి కేంద్రబిందువైంది. రాజకీయ, సినీ ప్రముఖులను దేవతల రూపంలో పోల్చుతూ బ్యానర్లు వేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

ఆ బ్యానర్‌లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ (దళపతి విజయ్) రూపాన్ని రావణాసురుడి రూపంలో చిత్రీకరించారు. అంతేకాకుండా, దాని కింద ప్రముఖ సినీనటి త్రిష ఫొటోను అమ్మవారి రూపంలో ముద్రించారు. అత్యంత పవిత్రంగా భావించే అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో ఇలా రాజకీయ నాయకులను, సినీ నటులను దేవతల అవతారాల్లో, వివాదాస్పద రీతిలో చూపించడం పట్ల స్థానికులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల పవిత్రతను దెబ్బతీసేలా ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని వారు మండిపడ్డారు.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు సైతం తీవ్రంగా స్పందించారు. ఆలయ ఉత్సవాల్లోకి రాజకీయాలను, సినిమాలను లాగాల్సిన అవసరం ఏముందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.

ఈ వివాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ బ్యానర్‌ను తొలగించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి కడైవీధి ప్రాంతానికి చెందిన చంద్రు, తలైవాసల్ ప్రాంతానికి చెందిన గోకుల్ అనే ఇద్దరు యువకులను గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పవిత్రమైన ఉత్సవాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఇలాంటి వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -