- Advertisement -

పవన్‌కు తీవ్ర అస్వస్థత..!

- Advertisement -

జనసేన అధినేత, పవన్ కళ్యాణ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం నేప‌థ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విష‌యం తెలిసిందే. 11 రోజులపాటు సాగిన దీక్షను బుధవారం శ్రీవారి దర్శనం తర్వాత విరమించారు.

అయితే శ్రీవారి మెట్లు ఎక్కే క్రమంలో పవన్‌ అస్వస్థతకు గురయ్యారు. తిరుమల మెట్లు ఎక్కిన త‌ర్వాత పవన్ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది. జ్వరంకు తోడు వెన్ను నొప్పితో బాధపడుతున్నారు పవన్.

బుధవారం రాత్రి తిరుమలలోనే బస చేశారు పవన్. ప్రస్తుతం తిరుమలలోని అతిథి గృహంలోనే వైద్య సేవ‌లు అందిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా ఇవాళ సాయంత్రం తిరుప‌తిలో నిర్వ‌హించే వారాహి స‌భ‌లో ఆయ‌న పాల్గొంటార‌ని పార్టీ శ్రేణులు వెల్ల‌డించాయి. తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలిలో వారాహి బహిరంగ సభ ఉండ‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -