పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గత 9 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు అన్నారు వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ప్రజాస్వామ్య బద్ధంగా జరుగుతున్న ఈ నిరసన దీక్షను రాజకీయ కోణంలో కుట్రలు చేసి భగ్నం చేయడం అత్యంత బాధాకరం అన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడే ప్రతి ఒక్కరి గొంతు నొక్కడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది అన్నారు. గత తొమ్మిది రోజులుగా పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న జక్కంపూడి రాజా గారిని అర్ధ రాత్రి సుమారు 150 మంది పోలీసులతో వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు.
తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం పేపర్ మిల్లు ఎదురుగా ఉన్న కళ్యాణమండపంలో ఉన్న జక్కంపూడి గారిని రేపు ఉదయం 9 గంటలకు ఆమరణ నిరాహారదీక్షకు సిద్ధమవుతున్న తరుణంలో ఆయనను ఇంటికి తరలించి హౌస్ అరెస్ట్ చేశారు. పేపర్ మిల్లు కి 500 మీటర్ల దూరంలో ఏ విధమైన ఆందోళనలు, నిరసనలు చేపట్టకూడదు అనే సాకుతో అక్రమంగా అరెస్ట్ చేసి దీక్షను ముందస్తుగా భగ్నం చేశారు పోలీసులు.జక్కంపూడి రాజాతో పాటూ మరో 50 మందిని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
