- Advertisement -

చంద్రబాబు ఫస్ట్..మమతా లాస్ట్!

- Advertisement -

దేశంలోనే రిచెస్ట్ సీఎం ఎవరో తెలుసా?..మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు మొదటి స్థానంలో ఉండగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో ఉన్నారు. ఈ మేరకు దేశంలో రిచెస్ట్ సీఎంల జాబితాను విడుదల చేసింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్.

రూ.931 కోట్లు ఆస్తులతో అగ్రస్థానంలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రెండో స్థానంలో రూ.332 కోట్లు ఆస్తులతో తర్వాతి పొజిషన్ లో అరుణాచల్ సీఎం పెమా ఖండ్ ఉండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులు రూ.30 కోట్లుగా ఉన్నాయి. ఆయన ఏడో స్థానంలో ఉన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.15 లక్షల ఆస్తులతో అత్యంత పేద ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ నివేదిక డిసెంబర్ 2024 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా రూపొందించినది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -