- Advertisement -

డ్రీమ్ 11కు బీసీసీఐ షాక్!

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్‌ ప్రమోషన్ మరియు రెగ్యులేషన్ బిల్లు, 2025 ఆమోదం పొందిన తర్వాత, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ మనీ గేమింగ్ కంపెనీ డ్రీమ్11 మధ్య కొనసాగుతున్న ₹358 కోట్ల జెర్సీ స్పాన్సర్‌షిప్ ఒప్పందం రద్దయింది. కొత్త చట్టం ప్రకారం ఈ ఒప్పందం కొనసాగితే అది చట్టవిరుద్ధమవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

BCCI ఇప్పటికే భాగస్వామ్యాన్ని ముగించినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, BCCI మరియు డ్రీమ్11 తమ అనుబంధాన్ని నిలిపివేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంస్థలతో సంబంధం పెట్టుకోకూడదని బోర్డు నిర్ణయించింది అని BCCI కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.

డ్రీమ్ స్పోర్ట్స్ 2023లో BCCIతో మూడు సంవత్సరాల జెర్సీ స్పాన్సర్‌షిప్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఆసియా కప్ సమీపిస్తున్న తరుణంలో భారత జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ లేకుండా పోయింది. సెప్టెంబర్ 9న UAEలో ప్రారంభమయ్యే ఆసియా కప్‌కి ముందు BCCI మరో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.

రియల్ మనీ గేమ్స్ (స్కిల్ ఆధారంగా ఉన్నా, లక్ ఆధారంగా ఉన్నా) – పూర్తిగా నిషేధం.డబ్బుతో సంబంధం ఉన్న గేమ్స్‌కి ప్రకటనలు, ప్రమోషన్‌లు అన్ని మీడియా వేదికలలో నిషేధం.ఆన్‌లైన్ మనీ గేమ్స్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు నిషేధం,బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్స్ ప్రాసెస్ చేయరాదు.చట్టవిరుద్ధమైన గేమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లను IT Act, 2000 కింద బ్లాక్ చేసే అధికారం.బిల్లు చట్టంగా మారిన వెంటనే, బ్యాంకులు గేమింగ్ కంపెనీలతో ఆర్థిక లావాదేవీల మార్గాలను కూడా బ్లాక్ చేసినట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -