- Advertisement -
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో జగన్ పులివెందులలో పర్యటించనున్నారు.2వ తేదీన వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు జగన్.
రేపు మధ్యాహ్నం 3 గంటలకు భాకరాపేటలోని క్యాంప్ కార్యాలయానికి వైఎస్ జగన్ చేరుకోనున్నారు. ఎల్లుండి ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులర్పించనున్నారు జగన్.
ఆ తర్వాత లింగాల మండలం అంబకపల్లిలో గంగమ్మ కుంట వద్ద జల హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు జగన్. పులివెందులలో ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల తర్వాత జగన్ తొలిసారి వస్తుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
