- Advertisement -
ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్. దసరా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి అని ఉత్తర్వులను వెలువరించింది.
మొత్తం 9 రోజుల పాటు విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 3న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో దసరాకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే.. టూర్ ప్లాన్ చేసుకునే పనిలో పడ్డారు. ఏపీలో అమ్మవారి ఆలయాల్లో ఈ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.
ఇక ఈసారి మైసూరును తలపించేలా బ్రతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.
