సింగరేణి కార్మికులకు దీపావళికి కూడా బోనస్ ఇస్తామని తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఒక్కో కార్మికుడికి బోనస్‌గా రూ.1,95,610 ఇస్తామని ప్రకటించారు.
అలాగే దీపావళికి కూడా బోనస్ ఇస్తాం అని వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌తో ప్రతి కార్మికుడికి లక్షా 95 వేల 610 రూపాయలు అందుతుందని… కాంట్రాక్టు కార్మికులకు రూ.5500 బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం ప్రాఫిట్ రూ.2360 కోట్లు కాగా ఇందులో కార్మికులకు 34 శాతం బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణిని తీర్చిదిద్దుతాం అని తెలిపారు సీఎం రేవంత్. సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేందుకు కృషి చేస్తాం అని… కేంద్రం జీఎస్టీని సవరించడంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్లు ఆదాయం తగ్గింది అన్నారు. తక్షణమే రాష్ట్రానికి జరిగే నష్టాన్ని కేంద్రమే పూడ్చాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన గనులను కూడా సింగరేణికి అప్పగించేలా చూడాలని కార్మికులు కోరారు…ప్రైవేటు భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్తులో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది..ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది అన్నారు. ఆ దిశగా కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం అన్నారు రేవంత్.
