- Advertisement -

సీఎం రేవంత్‌తో అమెజాన్ ప్రతినిధుల భేటీ

- Advertisement -

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్(AWS) ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. తెలంగాణలో AWSకు సంబంధించి ఆన్ గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు, విస్తరణ తదితర అంశాలపై సీఎంతో చర్చించారు ప్రతినిధులు.

పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని స్పష్టం చేశారు సీఎం. ఈ సమావేశంలో పాల్గొన్న AWS డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్‌ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని తదితరులు పాల్గొన్నారు.

అలాగే సీఎం రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ బృందం భేటీ అయింది. డ్యుయిష్ బోర్స్ కంపెనీ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది బృందం. వచ్చే రెండేళ్లలో సుమారు వెయ్యి మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు తెలిపారు జర్మనీ ప్రతినిధులు.

GCC ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా మలిచేందుకు జర్మనీ సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విద్యార్థులకు జర్మన్ భాష బోధించేందుకు టీచర్లను నియమించాలని కోరారు.

పెట్టుబడుల విషయంలో తెలంగాణ – జర్మనీ భాగస్వామ్యం మరింత బలపడాలని సీఎం ఆకాంక్షించారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మనీ కంపెనీలను పెట్టుబడులు పెట్టమని ఆహ్వానించారు. TOMCOM ద్వారా వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్‌లో జర్మనీ భాగస్వామ్యం అవసరమన్నారు సీఎం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -