- Advertisement -

టీమిండియాకు కెప్టెన్ లేరా..?

- Advertisement -

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమి పాలుకావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ తీవ్ర విమర్శలు చేశారు.

టీం ఇండియా ప్రదర్శనపై మాట్లాడుతూ కైఫ్, శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ అనుభవాన్ని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే ఇప్పుడీ జట్టుకు నిజమైన కెప్టెన్ లేడు. గిల్ ఇప్పుడు మాత్రమే కెప్టెన్సీ ప్రారంభించాడు. భారతదేశంలో అతను ఎంత కెప్టెన్సీ చేశాడు? వెస్టిండీస్ గురించి మాట్లాడకండి, దాన్ని పోల్చకండి. యూపీ రంజీ జట్టే వాళ్లను ఓడించగలదు. అందుకే చెబుతున్నా, ఇప్పటికీ వాళ్లకు సరైన కెప్టెన్ లేదు అని కైఫ్ అన్నారు.

అదే వ్యాఖ్యలను మరోసారి పునరావృతం చేస్తూ, జట్టులో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని కైఫ్ పేర్కొన్నారు. 2025లో జరిగిన ఆండర్సన్–టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లండ్‌తో సిరీస్ 2-2తో ముగిసిన విషయాన్ని కూడా కైఫ్ ప్రస్తావించారు. ఇంగ్లండ్‌తో పోలిస్తే సౌతాఫ్రికా చాలా తక్కువ తప్పులు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంగ్లండ్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆరవ స్థానంలో ఉంది. మీరు ఇంగ్లండ్‌ను ఎక్కువగా అంచనా వేస్తున్నారు. వాళ్లు ఏదో అప్రతిహత జట్టేమీ కాదు. బ్రాడ్, ఆండర్సన్ ఎవరూ లేరు, కొత్త బౌలర్లు ఆడుతున్నారు. అయినా సిరీస్ గెలవలేకపోయారు. చివరి టెస్టులో కూడా ఓడిపోయారు. ఇంగ్లండ్‌కు ఇంకా ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి, 70 పరుగులే అవసరం అని కైఫ్ విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -