దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా జట్టులో చేరారు. నితీష్ రెడ్డి, రింకు సింగ్‌లకు ఈసారి చోటు దక్కలేదు. జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం తిరిగి జట్టులో చేరాడు.
గిల్ సౌతాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన తొలి టెస్ట్‌లో మెడ గాయం కారణంగా సిరీస్ మిగతా మ్యాచ్‌లు మిస్ అయ్యాడు. అనంతరం బెంగళూరు సీఎస్‌ఈలో రిహాబ్ పూర్తి చేసుకుంటూ గత కొన్ని రోజులుగా నొప్పి లేకుండా పర్యాప్తంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
హార్దిక్ పాండ్యా చివరిసారి భారత్ కోసం 2025 సెప్టెంబర్ 26న శ్రీలంకతో ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో ఆడాడు. ఎడమ తొడ కండరాల గాయం కారణంగా దాదాపు రెండు నెలలు దూరంగా ఉన్న అతడు, అక్టోబర్ మధ్యలో రిహాబ్ పూర్తి చేసుకుని డిసెంబర్ 2న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున పంజాబ్‌పై 77 నాటౌట్‌తో మ్యాచ్ గెలిపించాడు.
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (ఉప కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), సంజు సామ్‌సన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీತ್ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్శ్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా, వాషింగ్టన్ సుందర్.
టీ20 సిరీస్ షెడ్యూల్:
– డిసెంబర్ 9: మొదటి మ్యాచ్ – కటక్
– డిసెంబర్ 11: రెండో మ్యాచ్ – ముల్లాన్‌పూర్ (న్యూ చండీగఢ్)
– డిసెంబర్ 14: మూడో మ్యాచ్ – ధర్మశాల
– డిసెంబర్ 17: నాల్గో మ్యాచ్ – లక్నో
– డిసెంబర్ 19: ఐదో, చివరి మ్యాచ్ – అహ్మదాబాద్
